Crows Attack: ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..

Updated on: Aug 14, 2024 | 12:47 PM

ఈ మధ్య మా అపార్ట్‌మెంట్లో ఎవరు టెర్రస్‌లోకి వెళ్లి కాసేపు కూర్చున్నా.. ఎక్కడ నుంచో వస్తున్న కాకులు కూర్చున్న వారిపై నుంచి వేగంగా దూసుకెళ్తున్నాయి.. ఒక్కోసారి వారిని కాళ్లతో తంతున్నాయి.. గాయపరస్తున్నాయి కూడా. దీంతో అపార్టమెంట్లో ఉన్న వాళ్లంతా టెర్రస్‌పైకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు రాజన్న - సిరిసిల్ల జిల్లాలోని కూడా జరుగుతోంది.

ఈ మధ్య మా అపార్ట్‌మెంట్లో ఎవరు టెర్రస్‌లోకి వెళ్లి కాసేపు కూర్చున్నా.. ఎక్కడ నుంచో వస్తున్న కాకులు కూర్చున్న వారిపై నుంచి వేగంగా దూసుకెళ్తున్నాయి.. ఒక్కోసారి వారిని కాళ్లతో తంతున్నాయి.. గాయపరస్తున్నాయి కూడా. దీంతో అపార్టమెంట్లో ఉన్న వాళ్లంతా టెర్రస్‌పైకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు రాజన్న – సిరిసిల్ల జిల్లాలోని కూడా జరుగుతోంది. సిరిసిల్ల బస్టాండ్లో కాకులు మనుషులపై ఎటాక్ చేస్తున్నాయి. అటువైపు వెళ్లే వారిని కాళ్లతో కొడుతున్నాయి.అందులోను మగవారే టార్గెట్.. స్త్రీలను ఏమి అనట్లేదు. ఈ సంగతి స్థానికులే చెబుతున్నారు. ఇది నిజంగా వింతగా ఉంది కదా.? డీటెయిల్స్ లోకి వెళితే.. సిరిసిల్ల జిల్లా కేంద్రం లో బస్టాండ్ నుండి బయటకి వెళ్ళే, లోపలికి వచ్చే మగ వాళ్లను  మాత్రమే తలపై తంతు చెట్టు కొమ్మలపై వాలుతున్నాయి. కట్ట మైసమ్మ గుడి ఆనుకొని ఉన్న వేప చెట్టు పై గూళ్ళు కట్టుకొని పదుల సంఖ్యలో ఉన్న కాకుల గూడు నుండి ఒక కాకి పిల్ల కింద పడిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆ చెట్టు కింద నుంచీ నడుస్తున్న మగ వాళ్లను కాకులు టార్గెట్ చేస్తున్నట్లుగా వారిపై తరచు దాడులు చేస్తున్నాయి. బస్టాండ్ కావడంతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. తెలియని వాళ్ళు ఆటు వైపు వెళ్లడంతో వారిపై దాడి చేస్తున్నాయి. అదేందిరా బాబు ‘కాకి గోల’ అని మనసులో అనుకుంటూ వేగంగా చెట్టు కింది నుండి నడిచి వెళుతున్నారు. తలపై...