రైలు పట్టాలపై మొసలి.. కాపాడేందుకు శ్రమించిన సిబ్బంది.. కానీ చివరకు.. వీడియో

|

Sep 19, 2021 | 8:35 AM

రైలు పట్టాలపై ఒక మొసలి గాయపడింది. దీంతో దానిని కాపాడేందుకు ఆ మార్గంలో ప్రయాణించే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను అరగంట నిలిపేశారు. గుజరాత్‌లోని వడోదర సమీపంలో ఈ ఘటన జరిగింది.

రైలు పట్టాలపై ఒక మొసలి గాయపడింది. దీంతో దానిని కాపాడేందుకు ఆ మార్గంలో ప్రయాణించే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను అరగంట నిలిపేశారు. గుజరాత్‌లోని వడోదర సమీపంలో ఈ ఘటన జరిగింది. రైలు ఢీకొని గాయపడిన మొసలిని ట్రాక్‌ తనిఖీ సిబ్బంది గమనించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్టేషన్‌ సూపరింటెండెంట్ వన్యప్రాణుల సంరక్షణ సిబ్బందికి ఫోన్‌ చేశారు. కాగా, ఆ సిబ్బంది వాహనంలో ఆ స్పాట్‌కు చేరుకుని తలకు గాయమైన మొసలిని పట్టాల పక్కకు చేర్చగా అక్కడ నిలిచిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ముందుకు కదిలింది. మరోవైపు ఎనిమిది అడుగుల పొడవైన ఆ మొసలి కొంతసేపటికే చనిపోయినట్లు వణ్యప్రాణుల సంరక్షణ కార్యకర్తలు తెలిపారు. మరణించిన ఆ భారీ మొసలిని ఆ తర్వాత కిసాన్‌ రైలులో తరలించి కర్జన్‌ అటవీశాఖకు అప్పగించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..

Balapur Ganesh Shobha Yatra: బాలాపూర్ బొజ్జ గణపయ్య లడ్డు వేలంపాట లైవ్ వీడియో..

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్ర లైవ్ వీడియో..

AP MPTC, ZPTC Election Results: ఏపీ పరిషత్ ఫైట్.. నేడే ఎన్నికల కౌంటింగ్ లైవ్ వీడియో

AP MPTC ZPTC Elections Results: ఏపీలో ప్రారంభమైన పరిషత్ ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నం నాటికి ఎంపీటీసీ ఫలితాలు..