Viral Video: చైనాలో కరోనా నిబంధనల పేరుతో క్రూరత్వం! ఐసోలేషన్ యూనిట్ల కోసం ఇళ్లను బలవంతంగా లాక్కుంటున్న పోలీసులు

|

Apr 16, 2022 | 4:01 PM

చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక్కడ సంక్రమణను నియంత్రించడానికి ప్రపంచంలోని కఠినమైన నియమం అమలు చేయడం జరుగుతోంది.

Viral Video: చైనాలో కరోనా నిబంధనల పేరుతో క్రూరత్వం! ఐసోలేషన్ యూనిట్ల కోసం ఇళ్లను బలవంతంగా లాక్కుంటున్న పోలీసులు
Viral Video
Follow us on

Cruelty to People in China: ఇంతకాలం తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా మరోసారి వేగంగా పెరుగుతోంది. చాలా దేశాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా చైనా(China)లో పెరుగుతున్న కరోనా కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక్కడ సంక్రమణను నియంత్రించడానికి ప్రపంచంలోని కఠినమైన నియమం అమలు చేయడం జరుగుతోంది. ప్రభుత్వం నిబంధనల్లో భాగంగా హోమ్ ఐసోలేషన్(Home Isolation) కోసం ప్రజల ఇళ్లను వారి నుండి బలవంతంగా లాక్కుంటున్నారు. వాస్తవానికి, షాంఘైలో పిపిఇ కిట్‌లు ధరించిన పోలీసులు,నివాసితుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. ఈ వీడియోలో, PPE కిట్‌లు ధరించిన చైనా పోలీసులు హౌసింగ్ కాంప్లెక్స్ వెలుపల కొత్త నిబంధన గురించి ప్రజలతో వాగ్వివాదానాకి దిగుతున్నారు.

షాంఘైలో ప్రభుత్వ నిబంధనలను పాటించడానికి నిరాకరిస్తున్న వారిని కూడా అరెస్టు చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, షాంఘైలోని జాంగ్‌జియాంగ్ నాషి కాంప్లెక్స్‌లోని ఫ్లాట్‌లను క్వారంటైన్ ఐసోలేషన్‌గా ఉపయోగించాలని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లోని ఒక నివేదిక తెలిపింది. ఈ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న ప్రజలు కోవిడ్ -19 బారినపడుతూ.. పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. తమ ఇళ్లను ఖాళీ చేయమని ఏప్రిల్ 14 న కోరినట్లు నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో అక్కడి ప్రజలు అందుకు నిరాకరించి నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి అక్కడి నుంచి తరలించారు. షాంఘైలో జీరో కోవిడ్ పాలసీ కింద నగరంలో ఓ హెల్త్‌కేర్ వర్కర్ మరణించడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెరపైకి వచ్చింది.


చైనా ఈ జీరో-కోవిడ్ విధానంలో పెరుగుతున్న కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులను నివారించడానికి దూకుడు విధానాలు, కఠిన చర్యలు ఉపయోగిస్తోంది. అవసరమైతే, COVID-19 వైరస్సంక్రమణను నియంత్రించడానికి చైనా అత్యంత కఠినమైన చర్యలు అమలు చేసేలా చట్టం రూపొందించింది. చైనా జీరో-కోవిడ్ విధానం కారణంగా, దేశంలో కోవిడ్ కేసులను నియంత్రించడానికి స్థానిక ప్రసారాన్ని నిరోధించడానికి ప్రజలు ప్రస్తుతం అవసరమైన ఆరోగ్య సంరక్షణ గానీ, ఆహారాన్ని పొందకుండా నిరోధించడం జరిగింది. ఆహారం, ఇతర వనరుల పరిమిత లభ్యతతో, షాంఘైలో నివసిస్తున్న ప్రజలు జైలులో ఉండవలసిందిగా ఆదేశించడం జరిగింది. మరోవైపు, స్థానికులకు తినేందుకు ఆహారం, నిత్యవసరాలు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు వీధుల్లోకి వచ్చిన వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నారు.

Read Also…  Pakistan: పంజాబ్ డిప్యూటీ స్పీకర్‌ను చెప్పుతో కొట్టి.. జుట్టు పట్టుకుని ఈడ్చేసిన పీటీఐ ఎమ్మెల్యేలు!