Car horn: ట్రాఫిక్‌లో పదే పదే హారన్ కొడుతున్న కారు డ్రైవర్‌కి అదిరిపోయే కౌంటర్..! వీడియో అదుర్స్..
హైదరాబాద్‌లోని నక్లెస్ రోడ్డుల్లో ఫిబ్రవరి 12న భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు అయ్యాక కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలేంటని అసలే వాహనదారులు కోపంలో ఉంటే.. ఆపై ట్రాఫిక్‌లో ముందుకు వెళ్లలేక..
హైదరాబాద్‌లోని నక్లెస్ రోడ్డుల్లో ఫిబ్రవరి 12న భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు అయ్యాక కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలేంటని అసలే వాహనదారులు కోపంలో ఉంటే.. ఆపై ట్రాఫిక్‌లో ముందుకు వెళ్లలేక.. వెనక్కి వెళ్లలేక ఇరుక్కుపోయి గరం గరంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఓ గూడ్స్ వ్యాన్ వెనుక ఉన్న ఓ కారు డ్రైవర్ తెగ హారన్ కొడుతూ మోత మోగిస్తున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ వ్యాన్ డ్రైవర్.. వాహనంలో నుంచి కిందికి దిగాడు. వేగంగా కారు ముందుకొచ్చి.. తన వ్యాన్ వెనకు డోర్ తీసి.. కారు డ్రైవర్‌కు లోపలినుంచి వెళ్లమని సైగ చేశాడు. వ్యాన్ డ్రైవర్ చేసిన ఈ పనికి.. కారు డ్రైవర్‍కు గట్టిగానే కౌంటర్ పడింది. “ముందు వెనక వాహనాలతో రోడ్డు మొత్తం ఫుల్ ప్యాక్ అయి ఉంటే నువ్వెక్కడి పోతావు.. అంతగా ఆగలేకపోతే నా వ్యాన్‌లోకి వెళ్లు.. ఇక్కడ మాత్రమే ఖాళీ ఉంది.” అంటూ సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌తో వ్యాన్ డ్రైవర్ ఇచ్చిన రిఫ్లైకి కారు డ్రైవర్‌కు దిమ్మతిరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు కూడా బాగానే స్పందిస్తున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
