భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా!

Updated on: Mar 12, 2026 | 3:10 PM

హైదరాబాద్‌లో గ్యాస్ సెగలు రేగుతున్నాయి. చర్లపల్లి ప్లాంట్ల నుంచి సరఫరా నిలిచిపోవడంతో నగరంలోని హోటల్ రంగం కుదేలైంది. కమర్షియల్ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో, గ్యాస్ బండ యజమానుల పాలిట 'గుదిబండ'గా మారింది. ప్రత్యామ్నాయం లేక భాగ్యనగరంలోని ప్రముఖ రెస్టారెంట్లు సైతం ఇప్పుడు కట్టెల పొయ్యిల బాట పట్టడం గమనార్హం.

పెట్రోలియం కంపెనీలు డీలర్లకు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం.. హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో చిన్న టిఫిన్ సెంటర్లు మొదలుకొని పెద్ద రెస్టారెంట్ల వరకు వంట చేయడం అసాధ్యంగా మారింది. గ్యాస్ లేక ఇప్పటికే అనేక చోట్ల హోటళ్లు బోర్డులు తిప్పేయగా, రోజువారీ వ్యాపారంపై ఆధారపడే చిరు వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.హైదరాబాద్‌కు గుర్తింపు తెచ్చే బిర్యానీ హోటళ్లలో ఇప్పుడు వింత దృశ్యాలు కనిపిస్తున్నాయి. వందల సంఖ్యలో బిర్యానీ హండీలు తయారు చేసే యజమానులు, గ్యాస్ కొరతను తట్టుకోవడానికి కట్టెలను ఆశ్రయిస్తున్నారు. గ్యాస్ స్టౌవ్‌ల స్థానంలో సంప్రదాయ పొయ్యిలు వచ్చి చేరాయి. వ్యాపారం దెబ్బతినడమే కాకుండా, వంటమనుషులు మరియు సిబ్బంది ఉపాధి కోల్పోతున్నారని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఇదే పరిస్థితి కొనసాగితే హోటల్ రంగం భారీ నష్టాల్లో కూరుకుపోతుంది” అని వారు హెచ్చరిస్తున్నారు. తక్షణమే కమర్షియల్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని హోటల్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ !

గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌

ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ

Follow Us