దెయ్యం నన్ను కాపాడింది.. బాయ్‌ఫ్రెండ్‌ కత్తితో పొడిచి పారిపోతే !!

Updated on: Aug 18, 2023 | 8:20 PM

దెయ్యాలు ఉన్నాయా..? లేవా..? కొందరు దయ్యాలను చూశాం, వాటితో మాట్లాడాం అంటుంటారు. హేతువాదులైతే దెయ్యాలు లేవు గియ్యాలు లేవు అంటూ వాదిస్తుంటారు. అయితే, అమెరికాలో ఓ టీచర్‌ మాత్రం దెయ్యాన్ని చూశానని చెప్పుకొచ్చింది. బాయ్‌ ఫ్రెండ్‌ తనని కత్తితో అతి దారుణంగా పొడిచి వెళ్లిపోతే.. రక్తపు మడుగుల్లో పడి ఉన్న తనని చూసి రెండు దెయ్యాలు పగలబడి నవ్వాయని.. ఆ సమయంలో మరో దెయ్యం వచ్చి తనని రక్షించిందంటూ షాకింగ్‌ ఘటనను బయటపెట్టింది.

దెయ్యాలు ఉన్నాయా..? లేవా..? కొందరు దయ్యాలను చూశాం, వాటితో మాట్లాడాం అంటుంటారు. హేతువాదులైతే దెయ్యాలు లేవు గియ్యాలు లేవు అంటూ వాదిస్తుంటారు. అయితే, అమెరికాలో ఓ టీచర్‌ మాత్రం దెయ్యాన్ని చూశానని చెప్పుకొచ్చింది. బాయ్‌ ఫ్రెండ్‌ తనని కత్తితో అతి దారుణంగా పొడిచి వెళ్లిపోతే.. రక్తపు మడుగుల్లో పడి ఉన్న తనని చూసి రెండు దెయ్యాలు పగలబడి నవ్వాయని.. ఆ సమయంలో మరో దెయ్యం వచ్చి తనని రక్షించిందంటూ షాకింగ్‌ ఘటనను బయటపెట్టింది. కొలరాడోలో ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది ఇలిష్‌ పో. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఆమె గతంలో తన జీవితంలో జరిగిన ‘దెయ్యం’ ఘటనను వివరించింది. 2020 లో ప్రియుడు తనపై దాడికి పాల్పడ్డాడని చెప్పింది. 16 సార్లు కత్తితో పొడిచి చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపింది. రక్తపు మడుగుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ సమయంలో తనకు మూడు దెయ్యాలు కనిపించాయని చెప్పింది. అందులో ఒక దెయ్యం తన అమ్మమ్మ అంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిల్‌గేట్స్‌ చేతిలో సల్మాన్‌ ఖాన్‌ ఫొటో.. ఎందుకంటే ??

మరో అద్భుత లోకాన్ని సృష్టించిన దుబాయ్.. చూస్తే మతిపోవాల్సిందే

అకౌంట్‌లో పైసా లేకున్నా ఏటీఎం నుంచి రూ. 80 వేలు డ్రా.. ఎగబడుతున్న జనం

పేకమేడల్లా కూలిన ఇళ్లను చూసారా ??

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడి కేసులో జడ్జి చేత చీవాట్లు తిన్న పోలీసులు