కచ్చా బాదం సింగర్‌ కోసం సినీ ప్రముఖులు క్యూ.. ఇప్పటికీ నెట్టింట దూసుకుపోతున్న కచ్చాబాదమ్‌ సాంగ్‌.. వీడియో

|

Mar 02, 2022 | 7:44 PM

కచ్చా బాదమ్‌.. ఇప్పుడు ఈ పాట గురించి తెలియనివారుండరు. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో మారుమోగిపోతోంది. సామాన్యులనుంచి సెలబ్రిటీల వరకు ఈ పాటకు తమదైన స్టయిల్లో స్టెప్పులేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో వీధి వీధి తిరిగి వేరుశెనక్కాయలు అమ్ముకునే


కచ్చా బాదమ్‌.. ఇప్పుడు ఈ పాట గురించి తెలియనివారుండరు. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో మారుమోగిపోతోంది. సామాన్యులనుంచి సెలబ్రిటీల వరకు ఈ పాటకు తమదైన స్టయిల్లో స్టెప్పులేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో వీధి వీధి తిరిగి వేరుశెనక్కాయలు అమ్ముకునే భుబాన్‌ ఈ పాటపాడి ఇప్పడు వెస్ట్ బెంగాల్‌లో పెద్ద సెల‌బ్రిటీ అయిపోయాడు. సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు కూడా భుబాన్‌తో త‌మ సినిమాల్లో పాట‌లు పాడించేందుకు క్యూ క‌డుతున్నారు. రీమిక్స్ సాంగ్‌, ర్యాప్ సాంగ్‌కు కూడా యూట్యూబ్‌లో కోట్ల‌లో వ్యూస్ వ‌చ్చాయి. మ‌రోవైపు ఇన్‌స్టాలో అయితే.. క‌చ్చా బాద‌మ్ సాంగ్ మార్మోగిపోతోంది. ఇదిలా ఉంటే అయితే.. క‌చ్చా బాద‌మ్ పాట ర్యాప్ కోసం గోధులిబెలా మ్యూజిక్ అనే కంపెనీ భుబాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ పాట ర్యాప్ సాంగ్ పాడ‌టం కోసం 3 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను పారితోషికంగా ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. అయితే.. నిజంగానే భుబాన్‌కు ఆ పారితోషికం అందిందా లేదా అని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఆరా తీయడంతో భుబాన్‌కు ఇటీవ‌లే లక్షా 50 వేల రూపాయల చెక్ అంద‌జేశామని, మ‌రో లక్షా 50 వేల చెక్‌ను వారం రోజుల్లో అందిస్తామని గోధులిబెలా మ్యూజిక్ కంపెనీ చెప్పుకొచ్చింది.

మరిన్ని చూడండి ఇక్కడ: