Cake mixing fest: భాగ్యనగరంలో ఆకట్టుకున్న కేక్ మిక్సింగ్ ఫెస్ట్‌.. పాల్గొన్న సినీ నటి స్నేహ..

|

Nov 21, 2022 | 9:13 AM

క్రిస్మస్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. క్రిస్మస్ క్రైస్తవులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. కరుణామయుడు యేసు క్రీస్తు జన్మదినమైన ఈ పర్వదినాన పిల్లల నుంచి పెద్దల వరకు ఆనందంగా గడుపుతారు.


క్రిస్మస్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. క్రిస్మస్ క్రైస్తవులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. కరుణామయుడు యేసు క్రీస్తు జన్మదినమైన ఈ పర్వదినాన పిల్లల నుంచి పెద్దల వరకు ఆనందంగా గడుపుతారు. క్రిస్మస్ రోజు ఎంతో ప్రత్యేకమైన వంటకం కేక్. ఈ నేపథ్యంలోనే లకిడికాపుల్‌లోని అశోక్ హోటల్‌లో కేక్ మిక్సింగ్ ఫెస్ట్‌తో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. సినీ నటి స్నేహ గుప్త పాల్గొన్న ఈ కార్యక్రమంలో వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, దేశీయ మద్యంతో పాటు ఖరీదైన వైన్‌తో కేక్ తయారీకి అవసరమైన మిక్సింగ్‌ను తయారు చేశారు. ఈ కేక్ మిక్సింగ్‌ను డిసెంబర్ రెండో వారం వరకు నానబెట్టి సోక్ చేసి చివరగా కేక్ తయారీని ప్రారంభిస్తామని హోటల్ చెఫ్ రామచందర్ తెలిపారు. చిన్ననాటి నుండి క్రిస్మస్ వేడుకలను స్నేహితులతో కలిసి ఘనంగా సెలెబ్రెట్ చేసుకొనే వాళ్లమని… ఈ కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు స్నేహ గుప్తా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Published on: Nov 21, 2022 09:13 AM