ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌

Updated on: Dec 26, 2025 | 11:50 AM

చైనాకు చెందిన 25 ఏళ్ల జాంగ్ నేటి తరం యువతకు ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తున్నాడు. 5 ఏళ్ళుగా ఫుడ్ డెలివరీ రైడర్‌గా పనిచేస్తూ లక్షా 60వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.కోటి 42 లక్షలు సేవింగ్స్ చేసి షాకిచ్చాడు. ఖరీదైన షాంఘై నగరంలో ఉంటూ కూడా.. కేవలం తన శ్రమను నమ్ముకుని ఈ అసాధారణ మైలురాయిని సృష్టించాడు.

జాంగ్ ప్రయాణం ఈజీగా సాగలేదు. 2020లో బ్రేక్‌ఫాస్ట్ సెంటర్‌ ప్రారంభించి నష్టపోవడంతో సుమారు 6 లక్షల రూపాయల అప్పులపాలయ్యాడు. ఆ అప్పులు తీర్చి, తన కాళ్ల మీద తాను నిలబడాలనే పట్టుదలతో షాంఘై నగరానికి వలస వచ్చాడు. అక్కడ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా చేరిన జాంగ్, అప్పులు తీర్చడమే కాకుండా తన భవిష్యత్తు కోసం కోటి రూపాయలకు పైగా వెనకేయడం అతని ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతోంది. జాంగ్ ఇంత పెద్ద మొత్తాన్ని సంపాదించడం వెనుక ఒకే ఒక్క సూత్రం ఉంది. అదే నిరంతర శ్రమ. ఉదయం 10:40 గంటలకు మొదలుపెట్టి.. అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట వరకు ఆర్డర్లు డెలివరీ చేసేవాడు. సెలవులు తీసుకోకుండా పని చేయడమే కాకుండా, సమయాన్ని ఆదా చేసేందుకు డెలివరీ సమయంలో ఎప్పుడూ పరిగెడుతూనే ఉండేవాడు. అందుకే తన తోటి రైడర్లు అతన్ని గౌరవంగా ‘ఆర్డర్ కింగ్’ అని పిలుస్తారు.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో