100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో

Updated on: Dec 26, 2025 | 4:40 PM

అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తించే రీతిలో చైనా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని శరవేగంగా విస్తరిస్తోంది. మంగోలియా సరిహద్దుకు సమీపంలో కొత్తగా నిర్మించిన మూడు క్షిపణి క్షేత్రాలలో 100కి పైగా ఘన ఇంధన ఆధారిత డీఎఫ్-31 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను చైనా మోహరించినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ రూపొందించిన ఒక ముసాయిదా నివేదిక వెల్లడించింది. గతంలో ఈ క్షేత్రాల నిర్మాణం గురించి పెంటగాన్ ప్రస్తావించినప్పటికీ, వాటిలో క్షిపణులను లోడ్ చేశారన్న విషయాన్ని బయటపెట్టడం ఇదే తొలిసారి.

పెంటగాన్ నివేదిక ప్రకారం.. చైనా తన అణు ఆయుధాగారాన్ని ఇతర అణ్వస్త్ర దేశాల కంటే వేగంగా విస్తరిస్తోంది, ఆధునికీకరిస్తోంది. 2024 నాటికి చైనా వద్ద సుమారు 600 అణు వార్‌హెడ్‌లు ఉండగా, 2030 నాటికి ఆ సంఖ్య 1,000 దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్షిపణి క్షేత్రాలను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ నిర్వహిస్తోంది. డీఎఫ్-31 క్షిపణులు దాదాపు 11,700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు.అణ్వాయుధాల నియంత్రణకు సంబంధించిన చర్చల విషయంలో చైనా ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ తరహా చర్యలు లేదా సమగ్ర అణ్వస్త్ర నియంత్రణ చర్చలు జరిపేందుకు బీజింగ్ వైపు నుంచి ఎలాంటి ఆసక్తి కనిపించడం లేదు,” అని నివేదికలో పేర్కొన్నారు. 2026 ప్రారంభంలో అమెరికా-రష్యాల మధ్య ఉన్న ‘న్యూ స్టార్ట్’ అణు ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో చైనా విస్తరణ ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో