ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత

Updated on: Jan 01, 2026 | 5:16 PM

చైనాలో ఫ్యాక్టరీ ప్రమాదంలో ఓ మహిళ చెవి తెగిపోయింది. రక్తనాళాలు దెబ్బతినడంతో వెంటనే అమర్చడం కష్టం. వైద్యులు తెగిన చెవిని ఆమె పాదంపై తాత్కాలికంగా అమర్చి, రక్తప్రసరణను పునరుద్ధరించారు. 10 గంటల మైక్రో సర్జరీ తర్వాత 5 నెలలు పాదంపై పెంచారు. అనంతరం విజయవంతంగా చెవిని తిరిగి అమర్చారు. ఇది వైద్య రంగంలో అద్భుత ఘట్టం.

చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన సన్ అనే మహిళ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె జుట్టు మెషిన్‌లో చిక్కుకుపోయింది. ఆ మిషన్ వేగానికి తల ఎడమవైపు చర్మం ఊడి రావడంతో పాటు చెవి పూర్తిగా తెగిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన కార్మికులు వెంటనే మిషన్‌ను ఆపేసి, ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతినడంతో వెంటనే చెవిని తిరిగి అమర్చడం సాధ్యం కాదని చెప్పారు. అయితే..తెగిపడిన చెవికి రక్తప్రసరణ అందకపోతే అది కుళ్లిపోయే ప్రమాదం ఉండటంతో వైద్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదం పైభాగంలో చర్మం పల్చగా ఉండటంతో పాటు అక్కడి రక్తనాళాలు చెవి రక్తనాళాల పరిమాణంలోనే ఉంటాయి కనుక ఆమె పాదానికి.. తెగిన చెవిని అమర్చారు. అక్కడ తలవెంట్రుకల కంటే సన్నగా ఉండే రక్తనాళాలు ఉండటంతో ఈ క్లిష్టమైన మైక్రో సర్జరీకి 10 గంటల సమయం పట్టింది. చెవి సురక్షితంగా పెరగడానికి సన్ ఐదు నెలల పాటు వదులుగా ఉండే బూట్లను ధరించారు. ఐదు నెలల నిరీక్షణ తర్వాత పాదంపై ఉన్న చెవిని తీసి, మునుపు ఉన్నచోటనే విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. గతంలో కూడా చైనా వైద్యులు రోగి భుజంపై చెవిని పెంచి అరుదైన రికార్డులు సృష్టించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..

మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

రూ. 15 వేల లోపు స్మార్ట్‌ఫోన్లు ఫీచర్లు మాములుగా లేవు

Best FD Interest Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా? ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ రేటు

గుండెను కాపాడే ఈ సూపర్ ఫుడ్ గురించి తెలుసా