strange custom: ఇదేం వింత ఆచారం రా బాబు..ఊరు ఊరంతా బండరాయిపైనే భోజనాలు.. వైరల్ అవుతున్న వీడియో.

|

Sep 01, 2022 | 9:46 PM

భారతదేశం ఆచార, సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ఆచారవ్యవహారాలు ఆచరిస్తూ ఉంటారు. ఎక్కడ ఎవరు ఏ పద్ధతులు పాటించినా అందరూ మంచి కోరే చేస్తారు.


భారతదేశం ఆచార, సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ఆచారవ్యవహారాలు ఆచరిస్తూ ఉంటారు. ఎక్కడ ఎవరు ఏ పద్ధతులు పాటించినా అందరూ మంచి కోరే చేస్తారు. దేశం సుభిక్షంగా ఉండాలని, రకరాల పద్ధతులు అవలంభిస్తారు. ఈ క్రమంలో మహబూబ్‌ నగర్‌లోని వెంకటగిరి గ్రామస్తులు వర్షాలు బాగా కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. అదేంటంటే..మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వెంకటగిరి గ్రామస్తులు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చివరి శనివారం రోజున గ్రామ సమీపంలోని కురుమూర్తి స్వామి పాదం బండపై భోజనం చేస్తారు. అది కూడా బండ పై ఎలాంటి విస్తరాకులు గానీ ప్లేట్లు గానీ లేకుండా, రాతి బండ పై అన్నం వడ్డించుకుని, పచ్చిపులుసు వేసుకుని గ్రామస్తులు అందరూ కలిసి తింటారు. శ్రీవేంకటేశ్వర స్వామి, కురుమూర్తి జాతరకు వెళుతూ తమ గ్రామ సమీపంలోని బండ పై కాలు మోపడం తో ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరిగేదని పూర్వీకులు చెప్పినట్టుగా స్థానికులు చెబుతారు. ఈ క్రమంలోనే శ్రావణ మాసంలో చివరి శనివారం రోజున గ్రామస్తులందరూ కలిసి ప్రతి ఇంటి నుంచి బియ్యం, నూనె,చింతపండు, ఉల్లిగడ్డలు అన్నీ సేకరించి పాదం బండ దగ్గరికి వచ్చి వంటలు చేసుకుంటారు. రాతి బండ పై ఎలాంటి విస్తరాకులు లేకుండా సహపంక్తి భోజనం చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, గొడ్డు గోదా గ్రామస్తులంతా క్షేమంగా ఉంటారని విశ్వసిస్తారు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

 

Published on: Sep 01, 2022 09:46 PM