ఏడాదిన్నర కూడా లేని ఈ చిన్నారి సంతోషం నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది! (Video)

|

Sep 14, 2021 | 9:37 AM

ఎలాంటి కల్మషం లేని మనసుకు పెట్టింది పేరు చిన్నారులు. సంతోషం వస్తే నవ్వడం, నొప్పి కలిగితే ఏడవడం వీరికి తెలిసిందే ఇంతే.. అంతకు మించి ఎలాంటి కుళ్లు, కుతంత్రాలు వీరికి తెలియదు. అందుకే చిన్నారుల చిరునవ్వు ఎంతటి వారినైనా మాయ చేస్తుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నాసరే చిన్నారి నవ్వు వింటే చాలు ఒత్తిడంతా పరార్‌ అవ్వాల్సిందే.

నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ చిన్నారి నవ్వు అందరినీ ఆకట్టుకుంటోంది. తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఏడాదిన్నర కూడా లేని ఆ చిన్నారి పలికించిన హావభావాలు నెటిజన్లను మెస్మరైజ్‌ చేస్తోంది. కుటుంబ సభ్యులు పిజ్జా ఆర్డర్‌ పెట్టుకున్నారు. అనంతరం డెలివరీ అయిన తర్వాత పిజ్జాను ఓపెన్‌ చేసే సమయంలో చిన్నారి అక్కడే ఉంది. దీంతో బాక్స్‌లో ఉన్న పిజ్జా కనిపించగానే చిన్నారి ఒక్కసారి ఫుల్‌ ఎగ్జైట్‌మెంట్‌ అయ్యింది. పిజ్జా చూసిన సంతోషంలో రెండు చేతులు పైకెత్తి గాల్లో ఊపుతూ కేరింతలు కొడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.