పని వాళ్లకి రూ.80 లక్షల ఇల్లు గిఫ్ట్ వీడియో

Updated on: Sep 07, 2025 | 10:39 PM

పనివాళ్లని చాలా మంది చిన్న చూపు చూస్తారు. డబ్బులిస్తున్నాం పనిచేస్తున్నారు అంతే వారి గురించి మనకెందుకు అని ఫీల్ అవుతారు. చాలా కొద్దిమంది మాత్రమే పని వారిని కూడా తమ కుటుంబ సభ్యుల లా భావిస్తారు. వారి బాగోగులు చూసుకుంటారు. తమ దగ్గర పని చేసే వారి పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తారు. వారి చదువుకు అవసరమైన సహాయం చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మరో అడుగు ముందుకేసి పని వారికి అన్ని సౌకర్యాలు కల్పించడమే కాక ఏకంగా తన దగ్గర పనిచేసే వారికి లక్షల రూపాయల విలువైన ఇల్లు కట్టించి ఇచ్చారు. ఈ ఘటన చెన్నైలో వెలుగుచూసింది.

చెన్నైలో బాల గురుస్వామి అనే వ్యక్తి గొప్ప మనసు చాటుకున్నారు. అన్నా విశ్వవిద్యాలయానికి ఆయన మాజీ ఉప కులపతి. మొదటి నుంచి కూడా పని వారి పట్ల అమితమైన ఆదరణ చూపేవారు. వారి పిల్లల భవిష్యత్తు కోసం కూడా డబ్బులు ఖర్చు చేశారు. పని వారి పిల్లలను సొంత బిడ్డల్లా భావించి చదివించారు. వారికి అవసరమైన వైద్య ఖర్చులు కూడా ఆయనే భరించారు. పెద్దయ్యాక వారికి మంచి సంబంధం చూసి వివాహం చేశారు. ఆఖరికి వారికి ఇల్లు కట్టించి వారినో ఇంటి వారిని కూడా చేశారు. తాజాగా బాల గురుస్వామి కోయంబత్తూర్ లోని తన ఇంట్లో పనిచేస్తున్న భువనేశ్వరన్, ప్రభావతి, భాగ్య, కృష్ణవేణిలకు వేరువేరుగా ఇళ్లు నిర్మించి వారికి అందజేశారు. ఇల్లు అంటే అదేమి సాదా సీదా ఇల్లు కాదు. మూడు సెంట్ల భూమిలో రెండు బెడ్ రూమ్ లతో నిర్మించారు. ఒక్కో ఇంటి ఖరీదు 80 లక్షల రూపాయలు. అయినా ఇలా పని వారి పట్ల మంచి మనసు చూపడం ఆయనకు కొత్తేం కాదు. కోయంబత్తూర్ కంటే ముందు ఆయన బెంగళూరులో పనిచేసేవారు. ఆ సమయంలో కూడా తన వద్ద పనిచేసే ఇద్దరికీ ఇలాగే ఇళ్లు నిర్మించి ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు. దీని గురించి బాల గురుస్వామిని ప్రశ్నిస్తే తానేం గొప్ప పని చేయలేదని వినమ్రంగా స్పందించారు. పైగా మనల్ని బాగా చూసుకునే వారిని మనము బాగా చూసుకోవాలి కదా. తన దగ్గర వారికి సాయపడే ఆర్థిక స్తోమత ఉందని అందుకే వారికి సాయం చేశానని అన్నారు. బాలగురుస్వామి మంచి మనసు తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయనను ప్రశంసిస్తున్నారు. మీలా కొందరు ఆలోచించిన సమాజంలో పేద ధనిక తారతమ్యాలు ఉండవని అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. దంచికొట్టనున్న వర్షాలు వీడియో

రైల్లో ప్రయాణిస్తుండగా గర్భిణికి పురిటి నొప్పులు..అంతలోనే వీడియో

షాకింగ్‌ ఘటన.. అప్పుడే పుట్టిన శిశువును చూసి వైద్యులు షాక్‌ వీడియో

కాలిన శరీరం..అయినా కొడుకు పుస్తకాలను చదివి… లా కాలేజ్‌లో సీటు పొంది వీడియో