రంజాన్ పర్వదినాల్లో చార్మినార్, పాతబస్తీ వీధులు కళకళలాడుతూ ఉంటాయి. చిరు వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద దుకాణాలు సైతం కిటకిటలాడుతుంటాయి. ఈ రంజాన్ వేళ నైట్ బజార్ మరింత ప్రత్యేకమైనది. పగలంతా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలు చంద్రోదయంతో దీక్ష విరమిస్తారు. అనంతరం బంధుమిత్రులంతా కలిసి విందు చేసుకుంటారు. అలాగే రాత్రి సమయంలో షాపింగ్ చేస్తారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 24 గంటలూ వ్యాపారం చేసుకోవచ్చని చెప్పడంతో వ్యాపారులకు ఈసారి రంజాన్ కలిసి వచ్చింది. దుకాణాలన్నీ వివిధ రకాల వస్తువులతో కళకళలాడతున్నాయి. రంజాన్ సందర్భంగా ఒక్క ముస్లింలు మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాలనుంచి జనం పెద్ద సంఖ్యలో వచ్చి నైట్ బజార్లో షాపింగ్ చేస్తుంటారు. దాంతో అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు కాకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా బందోబస్తు ఎలా జరగుతోంది? సిబ్బంది తమ విధులను ఏవిధంగా నిర్వహిస్తున్నారో తెలుసుకునేందుకు స్వయంగా డీసీపీనే రంగంలోకి దిగారు. దాదాపు 3 కిలోమీటర్లు కాలినడకన ప్రతి గల్లీని పరిశీలించారు. పాతబస్తీ లాంటి ఇరుకైన గల్లీలో ఒక ఐపీఎస్ స్థాయి అధికారి నడుచుకుంటూ బందోబస్తును పర్యవేక్షించడం ఇదే మొదటిసారి. డీసీపీ సాయి చైతన్యతో పాటు మీర్ చౌక్ ఏసిపి దామోదర్ రెడ్డి కూడా కలిసి ఇందులో పాల్గొన్నారు... ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులు స్వయంగా ప్రజల సమస్యలను పరిశీలించడంతో పాతబస్తివాసులు హైదరాబాద్ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..