Telangana: సెల్‌ఫోన్‌ దొంగల ఆటకట్టు..! కొత్త టెక్నాలజీ సాయంతో మొబైల్ వివరాలు క్షణాల్లో..

|

Apr 03, 2023 | 8:54 AM

ప్రస్తుతం రాష్ట్రంలో మొబైల్‌ ఫోన్ చోరీ అయినట్లు ఫిర్యాదు ఇచ్చినా.. పోలీసుల నుంచి అంతగా స్పందన ఉండదు. ఎందుకంటే మొబైల్ ఫోన్‌ పట్టుకునేంత సమయం, దానికి సరైన వ్యవస్థ మన పోలీసుల వద్ద లేకపోవడమే.

ప్రస్తుతం రాష్ట్రంలో మొబైల్‌ ఫోన్ చోరీ అయినట్లు ఫిర్యాదు ఇచ్చినా.. పోలీసుల నుంచి అంతగా స్పందన ఉండదు. ఎందుకంటే మొబైల్ ఫోన్‌ పట్టుకునేంత సమయం, దానికి సరైన వ్యవస్థ మన పోలీసుల వద్ద లేకపోవడమే. ధనవంతులకు ఫోన్ చోరీ అవ్వడం పెద్ద నష్టం కాకపోవచ్చు. కానీ పేద, మధ్యతరగతి వాళ్లకు మొబైల్ ఫోన్ ఓ లగ్జరీ. ఎన్నో నెలలు కష్టపడి.. నెలనెల ఈఎంలు చెల్లిస్తూ సెల్‌ఫోన్ కొంటుంటారు. అలాంటి ఫోన్‌ను అకస్మాత్తుగా ఎవరో ఎత్తుకెళ్తే..? అందుకే వీరి బాధను అర్థం చేసుకున్న తెలంగాణ పోలీసులు మొబైల్ ఫోన్ చోరీలను సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఏకంగా సీఐడీ విభాగం రంగంలోకి దిగుతోంది. రాష్ట్ర సీఐడీ విభాగం.. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్ (సీఈఐఆర్)’ తో ఒప్పందం కుదుర్చుకోబోతోంది. సీఈఐఆర్ సాయంతో చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను క్షణాల్లో ట్రాక్ చేయడమే కాదు.. అందులో వేరే సిమ్‌కార్డు వేయడానికి ప్రయత్నిస్తే.. ఇట్టే వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం దిల్లీ, ముంబయి, బెంగళూరు పోలీసులు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేసి మొబైల్ ఫోన్‌ దొంగల్ని పట్టుకుంటున్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ ఇది అమల్లోకి రానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 03, 2023 08:54 AM