భలే కొట్టేశారు.. తిరిగి తెచ్చి అక్కడే పెట్టేశారు..ఎందుకంటే వీడియో

Updated on: Sep 20, 2025 | 4:00 PM

అర్ధరాత్రి చోరీకి వచ్చిన దొంగలు తమను పట్టించాయన్న కోపంతో సీసీ కెమెరాలను విరగ్గొట్టి... సీసీ కెమెరాలు పెట్టించిన ఆ ఇంటి యజమానిని చితక్కొట్టి పారిపోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది. పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో అర్ధరాత్రి ఓ ఆటోను ఎత్తుకెళ్లిపోయారు దొంగలు. ఆటో స్టార్ట్‌ చేస్తే సౌండ్‌ వస్తుందని ఓ ముగ్గురు వ్యక్తులు ఆటోను కొంత దూరం తోసుకుంటూ వెళ్లి ఆ తర్వాత ఆటో స్టార్ట్‌ చేసుకొని వెళ్లిపోయారు. మర్నాడు ఉదయం ఆటోను తెచ్చి యధాస్థానంలో పెట్టి వెళ్లిపోయారు. అసలేం జరిగగిందంటే..

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్నం డ్రైవర్స్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు రోడ్డు పక్కన నిలిపించిన ఆటోను స్టార్ట్ చేస్తే శబ్దం వస్తుందని… మెల్లగా తోసుకుంటూ తీసుకెళ్లిపోయారు దొంగలు. ఇది ఏదో బాగుంది అనుకున్న దొంగలు అక్కడే ఉన్న మరో ఆటోను కూడా తీసుకెళ్లడానికి ప్రయత్నించగా… సరిగ్గా అదే సమయంలో ఎదురుగా ఉన్న ఇంట్లోంచి ఎవరో బయటకు వస్తున్న అలికిడి వినిపించడంతో ఆటోను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ మొత్తం వ్యవహారం సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆటోను ఎవరో దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు. అందులో ఉన్న దొంగను చూసి ఆటో యజమాని షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆటో దొంగతనం చేసింది ఎవరో కాదు… ఆటో యజమానికి స్వయానా మేనల్లుడే. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే… దొంగతనం చేసిన ఆటోను ముగ్గురు దొంగలు తిరిగి తోసుకుంటూ ఎక్కడైతే దొంగతనం చేశారో అక్కడే వదిలేసి వెళ్లారు. ఈ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం :

అమెజాన్, కార్ల్స్‌బర్గ్ కార్లైల్, గోద్రేజ్, ఉబర్ ప్రతినిధులతో సమావేశం వీడియో

అంబర్‌పేట్ బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం వీడియో

అంత్యక్రియలకు వెళ్లొస్తూ నలుగురు మృతి..వారి అంత్యక్రియలకు వెళ్లి మరో ముగ్గురు వీడియో

ఆగిన అంబులెన్స్.. దారిలోనే పోయిన ప్రాణం వీడియో