రాత్రివేళ ఒంటరిగా క్యాబ్‌లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి..
ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతి భద్రతపై ఆందోళన చెందుతున్న అన్నకు ఓ క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన భరోసా సోషల్ మీడియాలో హృదయాలను కదిలిస్తోంది. “ఆమె నా సొంత చెల్లెలిలాంటిదే” అంటూ డ్రైవర్ చూపించిన మానవత్వం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. మహిళల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న సమయంలో ఈ సంఘటన సమాజంలో ఇంకా మంచితనం ఉందనే నమ్మకాన్ని కలిగించింది.
రాత్రి వేళల్లో ఒంటరి ప్రయాణాలంటే మహిళలకు, వారి కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళనకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. తప్పని పరిస్థితుల్లో ఆడపిల్లను ఒంటరిగా.. అదికూడా రాత్రివేళ క్యాబ్‌లో పంపించడం ఎవరికైనా భయంకలిగిస్తుంది. అలాంటి పరిస్థితే ఓ అన్నకు ఎదురైంది. తన సోదరిని ఒంటరిగా క్యాబ్ లో పంపిస్తూ జాగ్రత్తలు చెబుతుంటే.. ఆ క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే ఆ సోదరుడికే కాదు.. నెటిజన్లకు కూడా కన్నీళ్లు తెప్పిస్తాయి.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీకి చెందిన లక్షయ్ మెహతా అనే యూట్యూబర్ తన సోదరిని గుర్గావ్ పంపించడానికి రాత్రి వేళ ఒక క్యాబ్ బుక్ చేశాడు. రాత్రి సమయం కావడంతో అతను తీవ్ర ఆందోళనతో సోదరికి పదేపదే జాగ్రత్తలు చెబుతుండటం క్యాబ్ డ్రైవర్ గమనించాడు. వెంటనే స్పందించిన ఆ డ్రైవర్.. “నా కారు నంబర్, నా చిరునామా ఫోటో తీసుకోండి. ఈమె నా సొంత చెల్లెలి లాంటిదే.. సురక్షితంగా గమ్యం చేర్చే బాధ్యత నాది” అని భరోసా ఇచ్చాడు. అంతటితో ఆగక ఆ యువతితో.. “ఏం టెన్షన్ పడకండి సిస్టర్.. ఇది మీ సొంత అన్నయ్య కారే అనుకుని హాయిగా కూర్చోండి” అంటూ మనస్ఫూర్తిగా మాట్లాడాడు. ఈ హృద్యమైన సంభాషణను లక్షయ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. సమాజంలో ఇంకా మంచి మనుషులు ఉన్నారని నిరూపించే ఈ హృద్యమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రయాణికుల భద్రతపై నిత్యం ఎన్నో వార్తలు వింటున్న ఈ రోజుల్లో, ఇంతటి బాధ్యత, మానవత్వం చాటుకున్న ఆ డ్రైవర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం కొన్ని మంచి మాటలతో ఒక కుటుంబంలో ధైర్యాన్ని నింపిన ఆ డ్రైవర్, ఇప్పుడు ఇంటర్నెట్‌లో రియల్ హీరోగా నిలిచాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘చావు అంచున ఉన్నాను.. నన్ను కాపాడండి’..
నవ్వుల వెనుక దాగిన విషాదం.. మిమిక్రీ మూర్తి చివరి రోజులు దారుణం!
‘చావు అంచున ఉన్నాను.. నన్ను కాపాడండి’..
