Viral Video: కొద్ది క్షణాల్లో పెళ్లి.. ఇంతలో ఆఫీస్‌నుంచి ఫోన్‌.. పెళ్లి పీటలపై ల్యాప్‌టాప్‌‌తో.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న వీడియో..

|

Feb 12, 2022 | 9:09 AM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ఆ అందమైన జ్ఞాపకాలను ఎంతో భద్రంగా దాచుకోవాలనుకుంటారు. అలానే కలలు కన్న ఓ యువతి పెళ్లి సమయంలోనూ ఆపీస్‌ వర్క్‌ చేస్తూ ఉండిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు


పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ఆ అందమైన జ్ఞాపకాలను ఎంతో భద్రంగా దాచుకోవాలనుకుంటారు. అలానే కలలు కన్న ఓ యువతి పెళ్లి సమయంలోనూ ఆపీస్‌ వర్క్‌ చేస్తూ ఉండిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న ఈ యువతికి ఎదురైన చేదు అనుభవాన్ని తన సోషల్‌ మీడియాలో పంచుకుంది. అందంగా ముస్తాబై.. కాసేపట్లో ఎంతో సంతోషంతో పెళ్లి మండపానికి వెళ్లాల్సిన వధువు.. ఆఫీస్ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ.. లాప్ టాప్ ముందు కూర్చుని బాధతో వర్క్ చేస్తుంది. ఆఫీస్‌ నుంచి వరుసగా కాల్స్‌ రావడం.. ఆ పని తనే చేయాలనడంతో పాపం.. లాప్ టాప్ ముందు కూర్చుని వర్క్‌ చేస్తుంది. ఓవైపు.. వర్క్ చేస్తూనే మరోవైపు వరుస ఫోన్ కాల్స్ ఆమెకు చిరాకు పుట్టించాయి. ఈ రోజు నా పెళ్లి.. దయచేసి ఆఫీస్ వర్క్ ఎవరైనా చూడండి.. అంటూ ఎంతో బాధతో ఆ వధువు వాపోయింది. ఈ వీడియోను మేకప్ ఆర్టిస్ట్ సోనా కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. పాపం ఆ పెళ్లి కూతురు వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.. వీడియో చూసిన నెటిజన్లు ఆ పెళ్లి కూతురి అవస్థకు పాపం అంటూ కామెంట్లు చేస్తున్నారు.. పెళ్లి రోజు కూడా అలా బాధించడం సరికాదంటున్నారు.