సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు !! స్టెప్పులకు నెటిజన్లు ఫిదా

|

Apr 21, 2022 | 8:06 AM

క‌రోనా శాంతిస్తోంది... జనాల జీవన సరళి ట్రాక్‌లో పడుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో రెండేళ్లకు పైగా ఫంక్షన్లు, విందులు వినోదాలకు దూరమైన ప్రజలు సంతోసంగా అడుగు ముందుకేస్తున్నారు.

క‌రోనా శాంతిస్తోంది… జనాల జీవన సరళి ట్రాక్‌లో పడుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో రెండేళ్లకు పైగా ఫంక్షన్లు, విందులు వినోదాలకు దూరమైన ప్రజలు సంతోసంగా అడుగు ముందుకేస్తున్నారు. పెళ్లిల్లు జోరుగా జ‌రుగుతున్నాయి. మూడేళ్లుగా పెళ్లి వాయిదా వేసుకున్నవారు ఇప్పుడు ఘ‌నంగా వివాహ వేడుక జ‌రుపుకుంటున్నారు. వ‌ధూవ‌రులు వివిధ పాట‌ల‌పై స్టెప్పులేసే వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా, ఓ వ‌ధువు త‌న సంగీత్ ఫంక్షన్‌లో బాలీవుడ్ హిట్‌సాంగ్‌పై డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆకాంక్ష మిశ్రా అనే వ‌ధువు త‌న‌ సంగీత్ ఫంక్షన్లో ‘బోలె చూడియా’ పాట‌పై అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ పాట 2001లో విడుద‌లైన ‘కభీ ఖుషీ కభీ గమ్’ అనే బాలీవుడ్ చిత్రంలోనిది. ఈ పాటంటే వ‌ధువుకు ఎంతో ఇష్టం. అందుకే అంద‌మైన లెహంగాలో స్టేజిపై త‌ళుక్కుమ‌న్న వ‌ధువు అదిరిపోయే స్టెప్పులేసి నెటిజ‌న్ల మ‌న‌సు దోచుకుంది. ఈ వీడియో చూసిన‌వారంతా ఫిదా అయిపోతున్నారు. నవ వధువును తమ కామెంట్లతో ఆశీర్వదిస్తున్నారు.

Also Watch:

Shah Rukh Khan: జక్కన్నకు బాద్షా గాలం !! షారుక్ భారీ ప్లాన్ ఇదే !!

బాలీవుడ్‌ను వణికిస్తున్న KGF2 !! ఆమీర్ ఖాన్ రికార్డే తాజాగా గల్లంతు !!

Allu Arjun: భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్

Know This: ప్రపంచంలో అత్యంత బరువైన చిలుక గురించి మీకు తెలుసా ??

Viral Video: ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి !! అన్యోన్యంగా యాపిల్‌ పంచుకుంటున్న మూగజీవులు

Follow us on