ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. కాటు వేస్తే

Updated on: Nov 09, 2025 | 2:22 PM

ఆఫ్రికాలోని బూమ్స్‌లాంగ్ పాము ప్రపంచంలో అత్యంత విషపూరితమైనది. ఆకుపచ్చ రంగులో చెట్లలో కలిసిపోయే ఈ 'సైలెంట్ కిల్లర్' పాము కాటు వేస్తే తక్షణమే ప్రాణాలు పోతాయి. అందంగా కనిపించినా దీని విషం ప్రాణాంతకం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో దీని ప్రమాదకర గుణాలను చూడవచ్చు. ఈ విష సర్పం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ప్రపంచంలో చాలా విషపూరిత పాములు ఉన్నాయి. అవి కాటు వేస్తే తక్షణమే ప్రాణాలు కోల్పోవాల్సిందే.! ఎందుకంటే వాటి విషం చాలా ప్రమాదకరమైనది. అందుకే పాములంటే భయపడతారు జనం. అలాంటి ప్రమాదకరమైన, విషపూరితమైన పాముకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి గురించి తెలిస్తే, ఎవరికైనా వెన్నుముకలో వణుకు పుట్టాల్సిందే..! ఈ పాము ఆఫ్రికాలో అత్యంత విషపూరితమైన పాముగా పరిగణిస్తారు. దీని పేరు బూమ్స్‌లాంగ్. ఈ పాము రంగురంగులుగా, అందంగా కనిపిస్తుంది. కానీ దాని విషం ఒక్క చుక్క చాలు.. మనిషి ప్రాణం తీసేస్తుంది. ఈ వీడియోలో, ఒక చెట్టు చుట్టూ పాము చుట్టుకుని, దాని వేటను నిశితంగా చూస్తున్నట్లు కనిపిస్తుంది. దూరం నుండి చూస్తే, అది చెట్టు కొమ్మలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆకుపచ్చ రంగులో ఉండి.. చెట్లలో కలిసిపోయి, టక్కున గుర్తించటం కష్టమవుతుంది. ఆఫ్రికాలో ఈ పామును “సైలెంట్ కిల్లర్” అంటారు. అందుకే, అది కనిపిస్తే ఇక జనం ఆ ఛాయలకే పోరు. సోషల్ మీడియాలో వైరల్ అయిన పాము వీడియోను చూసి జనం షాక్ అవుతున్నారు. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. “సైలెంట్ అస్సాసిన్‌ని కలవండి.. నెమ్మదిగా, ఖచ్చితంగా చంపుతుంది. ఆఫ్రికాలోని అత్యంత విషపూరితమైన పాము” అనే క్యాప్షన్‌ జోడించారు. ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు.. వందలమంది లైక్‌ చేస్తూ తమదైనశైలిలో కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఆలయంలో ఎలుకలే దేవుళ్లు..!

ఆఫ్రికన్‌ నత్తల దండయాత్ర.. మొక్కలు, తోటల విధ్వంసం

పెరట్లో కలుపు మొక్కలున్నాయా ?? జాగ్రత్త !!

నెల రోజుల పాటు ఉదయాన్నే ఈ నీరు తాగండి.. ఫలితం మీరే చూడండి

వీడు మామూలోడు కాదు.. హెల్మెట్‌కు బదులుగా మూకుడు