Blood Donation: నవ దంపతుల వినూత్న ప్రయత్నం.. పెళ్ళి మండపంలో స్వచ్చంద రక్తదాన శిబిరం…

Updated on: Feb 22, 2023 | 9:25 PM

సాటి మనిషికి సాయం చేయాలనే మనసు ఉండాలే కానీ అందుకు సమయం, సందర్భంతో పని ఉండదు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. నంద్యాల జిల్లాలో కొత్తగా పెళ్లి చేసుకుంటున్న యువతి, యువకుడు వినూత్నంగా

సాటి మనిషికి సాయం చేయాలనే మనసు ఉండాలే కానీ అందుకు సమయం, సందర్భంతో పని ఉండదు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. నంద్యాల జిల్లాలో కొత్తగా పెళ్లి చేసుకుంటున్న యువతి, యువకుడు వినూత్నంగా ఆలోచించారు. ఇటీవల తమ వివాహం ప్రత్యేకంగా నిలిచిపోవాలని చాలామంది రకరకాల విన్యాసాలు చేస్తూ నెట్టింట పోస్ట్‌ చేస్తూ లైక్స్‌, వ్యూస్‌తో సంబరపడిపోతుటే ఈ దంపతులు మాత్రం కొత్తగా ఆలోచించారు. తమ వివాహంద్వారా 10 మందికి మంచిజరగాలని కోరుకున్నారు. అందుకే తమ పెళ్లివేదికపైనే సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు. వధూవరులు తమ పెళ్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు. నవ దంపతులతోపాటు, బంధుమిత్రులు సైతం ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఈపెళ్లి వేడుకలో రక్తదానం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. నలుగురు ప్రాణాలు కాపాడామనే సంతృప్తి కోసం రక్తదానం శిబిరం ఏర్పాటు చేశామని చెప్పాడు వరుడు తేజ. స్వచ్ఛంద సేవా కార్యక్రమం నిర్వాహించాలనే తన కోరిక ఈవిధంగా తీరిందన్నారు. గతంలో తన సోదరుడి పెళ్లి లో కూడా ఇలానే రక్తందానం నిర్వహించారని.. అది చూసి ఇన్‌స్పేర్‌ అయ్యానని చెప్పాడు వరుడు సూర్య తేజ. నంద్యాల కు చెందిన సూర్య తేజ .. అనంతపురం జిల్లాకు చెందిన భవ్య ఈ సామాజిక సేవాకార్యక్రమంతో బంధుమిత్రుల మధ్యం ఘనంగా వివాహం జరిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 22, 2023 09:25 PM