Bird Unfurls Flag: కేరళలో పక్షి జెండా ఎగరేసిందా.? ఆ వీడియోలో నిజమెంత.?

|

Aug 21, 2024 | 5:02 PM

ఇండిపెండెన్స్ డే సందర్భంగా కేరళలో కొందరు పిల్లలు, పెద్దలు కలిసి జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ జెండా ఎగరవేస్తుండగా.. దురదృష్టవశాత్తు అది పైభాగంలో చిక్కుకుపోయింది. క్షణాల్లో, ఎక్కడి నుంచో ఎగురుతూ ఒక పక్షి వచ్చి చిక్కుకుపోయిన త్రివర్ణ పతాకాన్ని విప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆపై పక్షి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

కొన్ని దృశ్యాలు చూస్తే.. నమ్మశక్యంగా అనిపించవు. అరె.. ఇది ఏమైనా మ్యాజిక్కా లేక కనికట్టా అనిపిస్తుంది. తాజాగా 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చినట్లు ఓ వీడియో సర్కులేట్ అవుతోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా కేరళలో కొందరు పిల్లలు, పెద్దలు కలిసి జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ జెండా ఎగరవేస్తుండగా.. దురదృష్టవశాత్తు అది పైభాగంలో చిక్కుకుపోయింది. క్షణాల్లో, ఎక్కడి నుంచో ఎగురుతూ ఒక పక్షి వచ్చి చిక్కుకుపోయిన త్రివర్ణ పతాకాన్ని విప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆపై పక్షి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది “దైవిక జోక్యం!” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఈ ప్రకృతిలో ఏదో దాగి ఉంది. మనుషులే అర్థం చేసుకోలేకపోతున్నారు” అని మరొకరు వ్యాఖ్యానించారు. “ఇలా జరగడానికి ఆస్కారం లేదు.. ఇది ఎడిట్ చేసిన వీడియో కావొచ్చు” అని మరొక వ్యక్తి అనుమానం వ్యక్తం చేశారు. అసలు జరిగిన విషయానికి వస్తే.. వీడియోను తీక్షణంగా గమనిస్తే, ఆ పక్షి జెండా వద్దకు ఏం రాలేదు. అది జెండా ఎగరేసే క్రమంలో అక్కడి కొబ్బరి చెట్టు కొమ్మపైకి వచ్చి వాలింది. ఆ సమయంలో కొమ్మ కదలడం వీడియోలో కనిపించింది. ఎప్పుడైతే పైన జెండా ఊడి పూలు రాలాయో.. అందరూ క్లాప్స్ కొట్టగానే ఆ పక్షి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందులో కేవలం కెమెరా వేరే యాంగిల్‌‌లో షూట్ చేసిన వీడియోను చూస్తే పక్షి వచ్చి జెండాను విప్పినట్లుగా కనిపిస్తోంది. దీంతో కొందరు ఆ వీడియోను వైరల్ చేసినట్టు అర్థమవుతోంది. కానీ మరో యాంగిల్లో చూస్తే అసలు సంగతి బయటపడింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.