క్యాసినోలో రూ.25 లక్షలు గెల్చుకున్నాడు !! కానీ ఫ్రెండ్స్ చేసిన పనికి ??

|

Aug 15, 2023 | 7:44 PM

రోడ్లమీద టీ అమ్ముకుని పొట్టపోసుకునే ఓ యువకుడి జీవితాన్ని అతని స్నేహితులే సర్వనాశనం చేశారు. ఒక్కసారిగా మీద పడి కిడ్నాప్ చేసి ఊరి బయటికి తీసుకెళ్లి ఉన్న సొమ్మంతా దోచుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 15 లక్షలను అతని బ్యాంకు అకౌంటు నుంచి తమ అకౌంట్లలోకి బదిలీ చేయించుకుని కొట్టి పంపారు. టీ అమ్ముకునే వ్యక్తి దగ్గర అన్ని లక్షల డబ్బు ఎలా ఉందని అనుమానపడుతున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం. బెంగుళూరు త్యాగరాజనగర్‌కు చెందిన తిలక్ మణికంఠ

రోడ్లమీద టీ అమ్ముకుని పొట్టపోసుకునే ఓ యువకుడి జీవితాన్ని అతని స్నేహితులే సర్వనాశనం చేశారు. ఒక్కసారిగా మీద పడి కిడ్నాప్ చేసి ఊరి బయటికి తీసుకెళ్లి ఉన్న సొమ్మంతా దోచుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 15 లక్షలను అతని బ్యాంకు అకౌంటు నుంచి తమ అకౌంట్లలోకి బదిలీ చేయించుకుని కొట్టి పంపారు. టీ అమ్ముకునే వ్యక్తి దగ్గర అన్ని లక్షల డబ్బు ఎలా ఉందని అనుమానపడుతున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం. బెంగుళూరు త్యాగరాజనగర్‌కు చెందిన తిలక్ మణికంఠ అనే 32 ఏళ్ల వ్యక్తి టీ రోడ్లమీద అమ్ముకుని జీవిస్తున్నాడు. ఇంటి దగ్గర చిన్నపాటి నాన్ వెజ్ వంటలు కూడా అమ్ముతుంటాడు. మణికంఠ ఆగస్ట్‌ 1న గోవాకు స్నేహితులతో వెళ్లి క్యాసినోలో రూ. 25 లక్షలు గెలుపొందాడు. ఆ సంగతి స్నేహితులకు చెప్పకపోయినా అతని ముఖం చూసి కనిపెట్టారు. తర్వాత అందరూ బెంగళూరుకు తిరిగి వచ్చారు. మణికంఠ జాక్ పాట్ కొట్టిన సంగతి తెలుసుకున్న స్నేహితులు పండు, కార్తీక్, ఈశ్వర్, నిశ్చల్‌లు సొమ్ము కాజేయడానికి ప్లాన్ వేశారు. ఈ నెల 5న అతణ్ని ఓ బేకరీలో టీ తాగుతుండగా బయటికి పిలిచి కిడ్నాప్ చేశారు. కారులో జ్ఞానభారతి ప్రాంతానికి తీసుకెళ్లి కొబ్బరి చెట్టుకు కట్టేసి ఫోన్ లాక్కున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Corona Virous: మళ్లీ కరోనా టెన్షన్ !! 28 రోజుల్లో 80 శాతం కొత్త కేసులు !!

దేవర కోసం గాల్లో రక్త తర్పణం.. తమిళ్‌ తంబీల వింత మొక్కు

Bhola Shankar: మొత్తానికి 55కోట్లు గంగపాలు..

Chiranjeevi: చిరు సీరియస్ డెసిషన్ డైరెక్టర్స్‌కు వార్నింగ్ ??

Bhola Shanklar: బుక్ మై ఫో ఎఫెక్ట్.. పరువు పోయిందిగా !!

 

Follow us on