పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
కోట్లు ఖర్చు చేసి, వందలమంది సమక్షంలో పెద్దలు వివాహం జరిపించారు. కానీ ఆ బంధం బలపడలేదు సరికదా రెండు కుటుంబాలను తీరని విషాదంలోకి నెట్టేసింది. నవ దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం..కొత్తగా జీవితంలోకి వచ్చిన భార్యపై అనుమానం వెరసి వారిని ప్రాణాలు తీసుకునేలా చేసింది.. ఓ తల్లిని మృత్యు అంచుల్లోకి నెట్టేసింది. కొత్తగా పెళ్లి చేసుకొని హనీమూన్‌కి వెళ్లిన ఆ జంట నాలుగు రోజులకే వెనక్కి వచ్చింది. మనస్తాపంతో వధువు ఆత్మ హత్య చేసుకుంది.. భయంతో వరుడు ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటన బెంళూరులో జరిగింది.
అక్టోబరు 29న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో గానవి, సూరజ్‌లకు అత్యంత విలాసవంతంగా వివాహం జరిగింది. అయితే పెళ్లైన మొదటి రోజు నుంచే వీరిద్దరి మధ్య సఖ్యత లోపించింది. గానవికి మరొకరితో ఉన్న స్నేహాన్ని సూరజ్ అనుమానించగా సూరజ్ వైవాహిక జీవితానికి పనికిరాడని గానవి తన బంధువుల వద్ద వాపోయింది. ఇరు కుటుంబ సభ్యులు దంపతుల మధ్య రాజీ కుదిర్చి వారిని శ్రీలంకకు పది రోజుల హనీమూన్ పర్యటనకు పంపారు. కానీ అక్కడ కూడా గొడవలు ముదరడంతో పది రోజుల పర్యటనను కేవలం నాలుగు రోజులకే ముగించుకుని తిరిగి బెంగళూరు చేరుకున్నారు. హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన గానవి, రామమూర్తినగర్‌లోని తన పుట్టింటికి వెళ్లింది. తీవ్ర మనస్తాపానికి గురైన గానవి బుధవారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి ప్రాణాలు విడిచింది.
మరిన్ని వీడియోల కోసం :
