ప్రత్యర్థి విసిరిన పంచ్ యమపాశమైంది.. రింగ్‌లోనే కుప్పకూలిన యువ బాక్సర్‌

|

Jul 17, 2022 | 9:50 AM

బెంగళూరు నగరభావి ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి K1 కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి విసిరిన పంచ్‌కు ఓ యువ బాక్సర్ మృతి చెందాడు.

బెంగళూరు నగరభావి ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి K1 కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి విసిరిన పంచ్‌కు ఓ యువ బాక్సర్ మృతి చెందాడు. ఈ ఘటనలో నిర్వాహకులు నిర్లక్ష్యం ఉండటంతో వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మృతుడు మైసూరులో నివాసముంటున్న విమల – సురేష్ దంపతుల చిన్న కుమారుడు 23 ఏళ్ల నిఖిల్‌గా తెలుస్తోంది. జ్ఞాన జ్యోతి నగర్‌లోని పాయ్ ఇంటర్నేషనల్ బిల్డింగ్‌లో జరిగిన కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యర్థి విసిరిన పంచ్‌తో నిఖిల్ తలకు తీవ్ర గాయమైంది. అతడు స్పాట్‌లోనే కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండాపోయింది. మ్యాచ్ సందర్భంగా తీసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

News Watch: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ .అందుకు3 కారణాలు !! మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Published on: Jul 17, 2022 09:50 AM