ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్‌.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం

Updated on: Oct 03, 2026 | 6:29 PM

బెంగళూరులో ఆటో ఛార్జీ విషయంలో ఇద్దరు యువతులు, ఓ ఆటో డ్రైవర్‌ మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు స్పందించారు. యువతుల్లో ఒకరి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌ చేతన్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. అయితే యువతులే ముందుగా తనపై దాడి చేశారని, తాను ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించానని డ్రైవర్‌ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆటో ఛార్జీ విషయమై ఇద్దరు యువతులు మరియు ఒక ఆటో డ్రైవర్ మధ్య జరిగిన వాగ్వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. నడిరోడ్డుపై చెలరేగిన ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు వెంటనే స్పందించి, ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ 3వ సెక్టార్‌లో చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యువతులు, ఆటో డ్రైవర్ ఒకరినొకరు నెట్టుకుంటూ, భౌతిక దాడులు చేసుకుంటూ కనిపించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో, అక్కడే ఉన్న మరో మహిళ జోక్యం చేసుకుని వారిని విడదీసే ప్రయత్నం చేసింది. ఈ దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పోలీసులు బాధితులైన యువతులను సంప్రదించి ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. అనంతరం ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఆటో డ్రైవర్ చేతన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించడం, దాడికి పాల్పడటం వంటి సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. కోరమంగళలోని ఒక సెలూన్‌లో పనిచేసే ఈ యువతులు యాప్ ద్వారా ఆటో బుక్ చేశారు. రైడ్ పలుమార్లు క్యాన్సిల్ అవ్వడం, ఆపై ఆటో ఛార్జీల విషయంలో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. అయితే, యువతులు మద్యం మత్తులో ఉన్నారని, ఛార్జీ చెల్లించకుండా తనపైనే ముందుగా దాడికి దిగారని డ్రైవర్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తాను కేవలం ఆత్మరక్షణ కోసమే ప్రతిఘటించానని తెలిపాడు. ప్రస్తుతం పోలీసులు ఇరువర్గాల ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫిట్‌నెస్సే నా అసలు రహస్యం.. మనసు ప్రశాంతంగా ఉంటేనే రికార్డుల మోత

పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..

ప్రయాణికులకు అలర్ట్! ఇకపై రైల్లో ప్రయాణిస్తే అవి తప్పనిసరి!

విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..

ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!

Loading...
Unable to load recommendations.
Follow Us