పిల్లలకు పేర్లు పెడుతూ కోట్ల సంపాదన.. ఒక్కో పేరుకు రూ. 27 లక్షలు
తమకు పుట్టబోయే బిడ్డ విషయంలో పేరంట్స్ ఎన్నో కలలు కంటారు. పాప, లేదా బాబు పుట్టగానే పేరేం పెట్టాలా అని తెగ ఆలోచిస్తారు. వారి జన్మ రాశులకు సరిపోలేలా ఉండాలని కొందరనుకుంటే స్టైలిష్‌గా, పలకడానికి ఈజీగా ఉండాలని ఇంకొందరి ఆలోచన. ఇంకొందరు ఓ పట్టాన డిసైడ్ చేయక ఏ పేరు పెట్టకుండా ముద్దుపేర్లతో పిలిచేస్తుంటారు.
మొత్తంగా చూస్తే.. పిల్లలకు పేర్లు పెట్టడం అనేది .. అంత సులువైన పని మాత్రం కాదు. సరిగ్గా ఈ పాయింట్‌నే తన వ్యాపార విజయంగా మలచుకుంది.. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన టేలర్ హంఫ్రీ. పిల్లలకు పేర్లు పెట్టడంలో నిపుణురాలిగా వ్యాపారం మొదలుపెట్టి కోట్లు సంపాదిస్తోంది. “What’s in a Baby Name” పేరుతో ఆమె ఓ సంస్థను ప్రారంభించింది. తల్లితండ్రుల అభిరుచులు, కుటుంబ వారసత్వం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని ఆమె ప్రత్యేక పేర్లను సూచిస్తుంది. మంచి పేర్ల లిస్ట్ తయారుచేసి తల్లిదండ్రులకు మెయిల్ చేస్తుందట. టేలర్ ఇప్పటివరకు 500 మందికి పైగా చిన్నారులకు నామకరణం చేసింది. ఆమెకు మార్కెటింగ్, బ్రాండింగ్ లో కూడా పట్టుంది. తన వ్యాపారాన్ని, పేరు పెట్టడంలో తనకున్న నైపుణ్యాల్నీ పెట్టుబడిగా మార్చుకుని ప్రజల్లోకి వెళ్లింది.కొద్ది కాలంలోనే పాపులారిటీ సంపాదించింది. దీంతో.. అమెరికాలోని అనేకమంది శ్రీమంతులు, సెలబ్రిటీలు తమ పిల్లలకు పేర్లు పెట్టాలంటే టేలర్‌నే సంప్రదిస్తున్నారట. మంచిపేర్లు పెట్టటంలో పేరు సంపాదించిన టేలర్..ప్రపంచవ్యాప్తంగానూ ఎంతో మందికి చేరువైంది ఒక బేబీకి పేరు పెట్టడానికి కనిష్టంగా రూ.17 వేల నుంచి గరిష్టంగా రూ.26 లక్షల వరకు వసూలు చేస్తుంది. 2021లో ‘న్యూయార్క్ పోస్ట్’లో ఆమె కథనం వైరలైన సమయంలో అభినందనలతో పాటు “సులభంగా డబ్బు సంపాదించడానికి ఇదో ట్రిక్కు” అంటూ విమర్శలు కూడా వచ్చాయి. అయినా చేసే పనిపై తనకు పూర్తి నమ్మకముందని సున్నితంగానే విమర్శకుల నోళ్లు మూయించింది ఈ బేబీ నేమ్ స్పెషలిస్ట్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
త్వరలో వందే భారత్ 4.0.. గంటకు 320 కి.మీ స్పీడ్
2026లో అంతా విధ్వంసమే బాబా వంగా సరికొత్త జోస్యం
చేయని హత్యకు 43 ఏళ్లు జైలు..రిలీజయ్యాక కొత్త కష్టాలు
ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారా ?? ఈ స్టోరీ చూడాల్సిందే
