Viral Video: పక్షితో పిల్ల ఏనుగు ఫైట్‌ !! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

|

Jun 01, 2022 | 9:29 PM

కొందరు ఇతరులను ఆటపట్టిస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే అది అన్నిసార్లూ వర్కవుట్‌ కాకపోవచ్చు.. ఒక్కోసారి అది బెడిసికొట్టి వారినే ఇరకాటంలో పెట్టవచ్చు.

కొందరు ఇతరులను ఆటపట్టిస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే అది అన్నిసార్లూ వర్కవుట్‌ కాకపోవచ్చు.. ఒక్కోసారి అది బెడిసికొట్టి వారినే ఇరకాటంలో పెట్టవచ్చు. సరిగ్గా అదే జరిగింది ఇక్కడ. ఓ పిల్ల ఏనుగు ఓ పక్షిని ఆట పట్టించాలనుకుంది. సీన్‌ రివర్స్‌ అయి అదే చిక్కుల్లో పడింది. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్‌అవుతోంది. వీడియో చూస్తున్న నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. తమదైన శైలిలో పన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ కొలను దగ్గర ఏనుగు పిల్ల ఒకటి నీళ్లు తాగుతోంది. దానికి అవతల వైపున ఓ పక్షి కూడా నీళ్లు తాగుతోంది. అది గమనించిన ఈ ఏనుగు పిల్ల దాన్ని బెదిరించాలనుకుంది. దానిపై తొండంతో నీళ్లు కొడుతూ ఆట పట్టిస్తుంది. అంతే చిర్రెత్తుకొచ్చిన పక్షి ఆ గున్న ఏనుగుపై రివర్స్‌ అయింది. అవతలి నుంచి ఇవతలికి ఎగురుకుంటూ వచ్చి దాని వీపుపైకి ఎక్కి ఇష్టం వచ్చినట్లు తన్నింది.. ఏనుగు పిల్ల తప్పించుకున్నా వెంటపడి మరీ పొడిచింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాబోయే భర్తను పరిచయం చేసిన పూర్ణ.. వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్

సల్మాన్ సినిమాలో వెంకటేష్.. షూటింగ్‌లో జాయిన్ అవుతున్న వెంకీమామ

Akkineni Nagarjuna: మరో యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు నాగ్‌ గ్రీన్ సిగ్నల్ !!

 

Published on: Jun 01, 2022 09:29 PM