2026లో అంతా విధ్వంసమే బాబా వంగా సరికొత్త జోస్యం
2026వ సంవత్సరానికి సంబంధించి ప్రసిద్ధ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా వేసిన అంచనాలు భయానకంగా ఉన్నాయి. కొత్త సంవత్సరం 2026 చాలా దారుణాలకు వేదికగా నిలుస్తుందని అంచనా వేసింది. బాబా వంగా 2026 కోసం మూడు ప్రధాన జోస్యాలు చెప్పారు. యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి విధ్వంసం సృష్టిస్తాయని, కృత్రిమ మేధస్సు మానవ నియంత్రణ కోల్పోయి ఆధిపత్యం చెలాయిస్తుందని ఆమె అంచనా వేశారు.
నవంబర్ 2026లో ఏలియన్స్ భూమిపైకి అడుగుపెడతారనే భయాన్ని కూడా బాబా వంగా వెల్లడించారు. ఆమె మొదటి జోస్యం ప్రకారం.. కొత్త ఏడాదిలో యుద్ధాలు కేవలం సరిహద్దులకు పరిమితం కాకుండా, ఊహించని స్థాయిలో విధ్వంసం సృష్టిస్తాయి. రెండవ జోస్యం ప్రకారం..కృత్రిమ మేధస్సు.. మానవ నియంత్రణ నుండి పూర్తిగా జారిపోతుందని అనుమానం వ్యక్తం చేశారు. మనుషులు సృష్టించిన యంత్రాలు మనుషుల కంటే ఎక్కువగా ఆలోచించడం మొదలుపెడితే ఏమి జరుగుతుంది అనే ప్రశ్న ఆమె జోస్యంలో ఉంది. మూడవ జోస్యం గ్రహాంతరవాసుల రాకడ గురించి. భూమి మీద మనిషి ఒక్కడే కాదని, ఆకాశం అవతల నుండి అపరిచిత జీవులు భూమిపైకి అడుగుపెడతారని బాబా వంగా తెలిపారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం గురించి..తలచుకుంటుంటే జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సాఫ్ట్‌వేర్ రంగం కుదేలైన వేళ విదేశాల్లో ఉన్నవారంతా స్వదేశాల బాట పట్టిన సంఘటనలు ఇప్పటికీ చర్చనీయాంశమే. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి సంక్షోభం దిశగా పయనిస్తోందా అనే ప్రశ్న మళ్లీ గుబులు పుట్టిస్తోంది. కొత్త ఏడాది 2026లో ఆర్థిక మాంద్యం మరోసారి ప్రపంచాన్ని తలకిందులు చేయబోతుందనే బాబా వంగా జోస్యం నిజం కాబోతుందా అనే సందేహాలు చర్చకు దారితీస్తున్నాయి. ఈ అంచనాలు వాస్తవమవుతాయా లేదా అనేది చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేయని హత్యకు 43 ఏళ్లు జైలు..రిలీజయ్యాక కొత్త కష్టాలు
ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారా ?? ఈ స్టోరీ చూడాల్సిందే
దీపావళి తరువాత వెండి ధర పెరుగుతుందా? తగ్గుతుందా?
