Viral Video: నీకు ఇదేం పిచ్చి తల్లి.. ఈ మహిళ వెర్రి వేరే లెవల్ కు వెళ్ళింది.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..

|

Apr 05, 2022 | 1:02 PM

కొంతమంది చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాల్లో వింత వింత ప్రవర్తనతో పాపులర్ అవ్వాలని చూస్తున్నారు కొందరు.

Viral Video: నీకు ఇదేం పిచ్చి తల్లి.. ఈ మహిళ వెర్రి వేరే లెవల్ కు వెళ్ళింది.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..
Australian Woman
Follow us on

Viral Video: కొంతమంది చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాల్లో వింత వింత ప్రవర్తనతో పాపులర్ అవ్వాలని చూస్తున్నారు కొందరు. పిచ్చి పిచ్చి చేష్టలతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ చేసిన పని నెటిజన్లకు కోపం తెప్పిస్తుంది. పిచ్చి ముదిరింది అంటూ.. ఆ మహిళను తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఇంతకు ఆ మహిళ చేసిందంటే.. కొంతమంది చేసే వెర్రి పనులు కొన్నిసార్లు సరదాగా ఉన్నపటికీ.. కొన్ని సార్లు కోపం తెప్పిస్తూ ఉంటాయి. ఈ మహిళ కూడా అలాంటి కోపం వచ్చే పనే చేసింది. అబ్బాయిలు కనిపిస్తే చాలా ఇష్టం వచ్చినట్టు ముద్దులు పెట్టేసింది. అందులో ఏముంది అనుకుంటున్నారా.. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.

సెయింట్ పాట్రిక్స్ డే రోజున సిడ్నీలోని క్లబ్‌లో ఓ మహిళ లిప్ స్టిక్ పెట్టుకొని.. వైట్ టీషర్ట్ వేసుకున్న అబ్బయిల వీపుల పై భుజాలపై వారికి తెలియకుండా ముద్దులు పెట్టింది. తన లిప్స్ ముద్ర పడేలా ముద్దులు పెట్టింది. లిప్ స్టిక్ పూసుకుంటూ వారి టీషర్ట్స్ ను పాడు చేసింది. తెల్లటి టీ-షర్టులపై లిప్‌స్టిక్‌ను పూయడం మరియు ముద్దులు పెట్టడం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళ పై మండిపడుతున్నారు. ఇది ఫన్నీ కాదు.. ఇలా చేయడం సరికాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది.  దీనికి 3 మిలియన్లకు పైగా వ్యూస్ అలాగే 190k లైక్‌లు వచ్చాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral Video: అందరూ ఇంట్లోనే ఉండగా అనుకోని అలజడి.. ఆ పాప చూడకపోయి ఉంటే..

Viral Video: ఇదేం పిచ్చిరా నాయనా..! ఈ అమ్మాయి చేసిన పనికి అంతా షాక్.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్

Artillery Center Hyderabad Jobs 2022: ఇంటర్‌, డిప్లొమా అర్హతతో గోల్కొండ ఆర్టిలరీ సెంటర్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!