ఏవియేషన్‌ చరిత్రలో అద్భుతం.. ప్రకృతి థీమ్‌తో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్

Updated on: Dec 24, 2025 | 11:13 AM

గువాహటిలోని లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నూతన టెర్మినల్ ప్రారంభమైంది. అస్సాం సంస్కృతి, ప్రకృతి అందాలను మిళితం చేసిన ఈ గ్రీన్ టెర్మినల్‌ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అత్యాధునిక సాంకేతికత, సౌరశక్తితో నడిచే ఈ ప్రాజెక్ట్ పర్యావరణ అనుకూలతను చాటుతుంది. ఇది అస్సాం పర్యాటక, వాణిజ్య రంగానికి కొత్త గేట్‌వేగా నిలుస్తుంది.

విమానయాన రంగంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రకృతి అందాలు, ఆధునిక సాంకేతికత మేళవించిన విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభమైంది.అస్సామీ సంస్కృతికి ప్రతిబింబంగ నిలిచిన ఈ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ అక్కడి అడవుల అందాలను ప్రయాణికుల ముందుకు తెచ్చింది. స్థానిక సంస్కృతిని అంతర్జాతీయ సాంకేతితల మేళవింపుగా తీర్చిదిద్దిన ఈ గువాహతి లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిని చూసిన వారంతా ఇది కేవలం ఎయిర్‌పోర్ట్‌ మాత్రమే కాదు..అసోం ఆత్మను అంతర్జాతీయ స్థాయిలో ఆవిష్కరించే గొప్ప నిర్మాణమని కొనియాడుతున్నారు. సాధారణంగా ఎయిర్‌పోర్ట్‌లు అంటే కాంక్రీట్ కట్టడాలు గుర్తుకు వస్తాయి, కానీ ఈ టెర్మినల్ లోపల అడుగుపెడితే అసోం అడవుల్లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. టెర్మినల్ లోపల ఏర్పాటు చేసిన పచ్చదనం ప్రయాణికులకు మనోల్లాసాన్ని కలిగిస్తుంది. ఈశాన్య భారత వారసత్వాన్ని చాటేలా భవనమంతా వెదురును వినియోగించారు. అస్సామీ సాంప్రదాయ టోపీ, నమూనాలు, ఖడ్గమృగాల చిత్రపటాలతో భవనాన్ని అలంకరించారు. అసోం రాష్ట్ర పుష్పం కోపౌ ఆకారంలో నిర్మించిన స్తంభాలు ఈ టెర్మినల్ కే ప్రధాన ఆకర్షణ. దీని అద్భుతమైన నిర్మాణానికి అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ అవార్డు 2025 కూడా దక్కింది. 1.4 లక్షల చదరపు మీటర్లు విస్తీర్ణంలో సుమారు 5వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ కొత్త టెర్మినల్ ద్వారా ఏడాదికి 1.31 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే వీలుంది. రద్దీ సమయాల్లో గంటకు దాదాపు 4,500 మంది ప్రయాణికులను తనిఖీ చేసే సామర్థ్యం దీని సొంతం. ఫుల్ బాడీ స్కానర్లు, ఆటోమేటెడ్ బ్యాగేజీ యంత్రాలు, అత్యాధునిక ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇది రద్దీని తగ్గించడమే కాకుండా, ప్రయాణ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి నిర్మించిన ఈ భవనం పూర్తిగా సౌరశక్తితో నడుస్తుంది. సహజ సిద్ధమైన వెలుతురు వచ్చేలా చేసిన డిజైన్, నీటి పునరుద్ధరణ వ్యవస్థలు దీనిని ‘గ్రీన్ ఎయిర్‌పోర్ట్’గా నిలబెట్టాయి. ఈ టెర్మినల్ అసోం పర్యాటకానికి, వాణిజ్యానికి ఒక భారీ గేట్‌వేగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Duvvada Srinivas: రమ్య మోక్షకు బిగ్‌బాస్ అన్యాయం

ఆయనకు రూ.50లక్షలు.. ఆమెకు రూ.40 లక్షలు!.. కానీ తనూజకే ఎక్కువ పైసలు

కొడుకుకు రూ.40 లక్షలు.. అమ్మకు రూ.42 లక్షలు!..ఇద్దరికీ జాక్ పాట్

పవన్ , NTR పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు! తప్పక పాటించాల్సిందే

కొడుకు హత్యకు తండ్రి సుపారీ… ఎందుకో తెలిసి పోలీసులే షాక్‌