తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. ముంగిట్లో ఉన్నది చూసి మూర్ఛపోయాడు

Updated on: Jan 21, 2026 | 5:42 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారి గూడెంలో ఆదివారం అమావాస్య రోజున క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఒక ఇంటి వరండాలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పాటు ఎర్రటి గుడ్డలో జంతు పుర్రె కనిపించింది. దీనితో ఇంటి యజమాని, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఆదివారం..అమావాస్య ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈరోజు మంత్రపఠనం చేసినా, పుణ్యకార్యాలు చేసినా రెట్టింపు ఫలితం దక్కుతుందని నమ్ముతారు. అలాగే కొందరు క్షుద్రపూజలు చేసేవారూ ఉంటారు. అలాంటిదే జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. ఓ ఇంటిముందు వరండాలో క్షుద్రపూజలు చేసి ఉండటం చూసి ఆ ఇంటివారు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారి గూడెం లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి, రంవారి గూడెం గ్రామంలో ఇంటి యజమాని తెల్లవారి లేచి బయటకు రాగానే వరండాలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేసి ఉండటం చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. భయంతో కేకలు వేయగా చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. అక్కడి దృశ్యాలను చూసి స్థానికులు సైతం వణికిపోయారు. అల్లాడి పద్మ అనే మహిళ తెల్లవారుజామున ఇంటి వరండా శుభ్రం చేస్తుండగా ఒక ఎర్రటి గుడ్డలో ఉంచిన ఒక జంతు పుర్రె,నిమ్మకాయ, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉడంటం చూసి భయంతో కేలు వేస్తూ చుట్టుపక్కలవారందరినీ పిలిచింది. అక్కడికి చేరుకున్న స్థానికులు వరండాలో ఉన్న సామాగ్రి చూసి ఆశ్చర్యపోయారు. అమావాస్య, ఆదివారం కావడంతో ఎవరో క్షుద్రపూజలు చేశారని గ్రహించి తీవ్ర భయాందోళనకు గురైన వారు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన జరిగిన ప్రదేశానికి స్థానిక పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రితో కలిసి రీల్స్‌ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి.. అసలు ఏం జరిగింది

నాన్నా కాపాడు అంటూ ఫోన్‌ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

Vande Bharat: ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..

Tollywood News: టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?

సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి