Army Officers: ఆర్మీ అధికారులను దోచుకుని.. వారి స్నేహితురాళ్లపై అత్యాచారం చేసి.. వీడియో.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇద్దరు యువ ట్రైనీ ఆర్మీ అధికారులు, వారి స్నేహితురాళ్లను సాయుధులు కొందరు దోచుకున్నారు. దుండగులు వారిపై దాడిచేసిన అనంతరం వారి స్నేహితురాళ్లపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ నేరానికి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరికి ఇప్పటికే క్రిమినల్ రికార్డు ఉన్నట్టు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇద్దరు యువ ట్రైనీ ఆర్మీ అధికారులు, వారి స్నేహితురాళ్లను సాయుధులు కొందరు దోచుకున్నారు. దుండగులు వారిపై దాడిచేసిన అనంతరం వారి స్నేహితురాళ్లపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ నేరానికి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరికి ఇప్పటికే క్రిమినల్ రికార్డు ఉన్నట్టు తెలిపారు. ఎంహౌ ఆర్మీ కాలేజీలో శిక్షణలో ఉన్న వారు స్నేహితురాళ్లతో కలిసి మంగళవారం మధ్యాహ్నం చోటీజామ్‌లోని ఫైరింగ్ రేంజ్ వద్దకు వెళ్లారు. అక్కడ వారిని అకస్మాత్తుగా 8 మంది సాయుధులు చుట్టుముట్టారు. వారి చేతుల్లో పిస్తోలు, కత్తులు, కర్రలు ఉండడంతో అధికారులు, వారి స్నేహితురాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అందరూ కలిసి ట్రైనీ అధికారులపై దాడి చేసి వారి వద్దనున్న డబ్బులు, ఇతర వస్తువులను లాక్కున్నారు.
ఆ తర్వాత ఒక అధికారి, ఒక మహిళను బందీగా తీసుకున్న దుండగులు మిగతా ఇద్దరిని రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. ఆ డబ్బును తీసుకురావాలని వారిని వెనక్కి పంపించారు. దీంతో భయపడిపోయిన అధికారి వెంటనే తమ యూనిట్‌కు వచ్చి తమ కమాండింగ్ అధికారికి విషయం చెప్పాడు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అందరూ కలిసి ఘటనా స్థలానికి వస్తుండడం చూసిన నిందితులు ఆర్మీ అధికారిని, మహిళను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఎంహౌ సివిల్ ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు అధికారులు ఇద్దరికీ గాయాలైనట్టు నిర్ధారించారు. అలాగే, మహిళపై సామూహిక లైంగికదాడి జరిగినట్టు నిర్ధారణ అయింది. బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.