మ్యారేజెస్ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి.. కారణం ఆ ఒక్క దానివల్లే
ఆంధ్రప్రదేశ్‌లో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. పల్నాడు, కర్నూలు జిల్లాల్లో ఈ కేసులు అధికం. సోషల్ మీడియా మాయమాటలు, తల్లిదండ్రులకు అవగాహన లోపమే ప్రధాన కారణాలుగా గుర్తించారు. పిల్లల ఆరోగ్య సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరుగుతుండటం కలవరపెడుతోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక అంశాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పల్నాడు, కర్నూలు జిల్లాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఎక్కువగా ఉన్నాయని, విజయవాడ GGH నుంచి కూడా పూర్తి డేటా సేకరిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయమైన అపరిచితుల మాయమాటలు నమ్మి అమ్మాయిలు ఇళ్లను వదిలి వెళ్తున్నారని, మిస్సింగ్ కేసులు నమోదై పోలీసులు వారిని కనిపెట్టేలోపే ప్రెగ్నెన్సీ వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.చదువు లేని తల్లిదండ్రులు ఉండటం, అవగాహన లోపంతో తొందరగా పెళ్లిళ్లు చేయడం కూడా దీనికి కారణమని, అందుకే పేరెంట్స్‌కు పిల్లల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నామంటున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ తో ఫేస్ టు ఫేస్
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
EPFO: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖరారు..
Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతు వినూత్న ప్రయోగం !!
పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా
Viral Video: రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం
