ఆ నిర్ణయాల్లో మానవుల కన్నా చీమలే బెటర్ !​!

|

Jan 13, 2025 | 2:34 PM

ఒక బృందంగా కలిసి నిర్ణయాలు తీసుకోవడంలో, అందరితో కలిసి పనిచేయడంలో మనుషుల కంటే చీమలే చాలా బెటర్​ అని తాజా పరిశోధనలో తేలింది. గ్రూప్​ డెసిషన్స్​ తీసుకోవడంలో ఇప్పటి వరకు మానవులే అపర మేధావులనే అపోహ ఉంది. కానీ ఈ విషయంలో మనుషుల కంటే చీమలే చాలా మెరుగని స్పష్టమైంది.

శ్రమశక్తికి చీమలు ప్రబల ఉదాహరణలు! సంఘశక్తిని చాటుతూ క్లిష్టమైన పనులు నిర్వర్తించడంలో వాటికి ఎవరకూ సాటి లేరు. తాజా పరిశోధన ప్రకారం, ‘ఒక చిక్కు మార్గం గుండా భారీ సరకులను చాలా యుక్తిగా, సులువుగా మోసుకెళ్లే విషయంలో చీమలు, మానవుల కన్నా ఎంతో సమర్థతతో పనిచేస్తాయి. ఇందుకోసం పక్కా వ్యూహాన్ని అనుసరిస్తాయి. సామూహికంగా అన్నీ ఒక లక్ష్యంతో పనిచేస్తాయి. వాటి జ్ఞాపక శక్తి కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఎలాంటి తప్పిదాలు జరగకుండా పక్కా ప్రణాళికతో పనిచేసి తమ లక్ష్యాన్ని పూర్తి చేస్తాయి.’ చీమలతో పోల్చితే, మనుషుల పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. అందరూ కలిసి ఒక బృందంగా ఏర్పడి నిర్ణయాలు తీసుకునే విషయంలో చీమలు మెరుగ్గా పనిచేస్తే, మనుషులు మాత్రం ఈ విషయంలో వెనుకబడ్డారు. అంతేకాదు గ్రూప్ డెసిషన్ మేకింగ్​ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంలోనూ మానవులు విఫలమయ్యారు. ఇజ్రాయెల్​లోని వెయిజ్​మన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సైన్స్​ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయాలు తెలిసాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డాకు మహారాజ్‌పై రాజమౌళి తనయుడి రివ్యూ

Prabhas: ప్రభాస్ సీక్రెట్‌గా దాచుకున్న పెళ్లి మ్యాటర్

ఫ్యాన్స్ అసహనం.. దీంతో మేకర్స్ తీసుకున్నారు బంపర్ డెసిషన్

TOP 9 ET News: డాకు మహారాజ్ బంపర్ హిట్.. డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్

కిటికీ నుంచి వింత శబ్ధాలు.. వెళ్లి చూసిన యజమానికి షాక్‌