Post Office Scheme: మహిళలను పోస్టాఫీస్‌కి పరుగులు పెట్టిస్తోన్న కాంగ్రెస్ హామీ..
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఓ హామీ మహిళలను పోస్టాఫీస్‌కు పరుగులు పెట్టిస్తోంది. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలో వస్తే ప్రతి మహిళ అకౌంట్లో నెలకు 8 వేల 500 రూపాయలు జమ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటతో పోస్టాఫీస్‌లో ఖాతాలు తెరిచేందుకు మహిళలు ఎగబడుతున్నారు. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్న ప్రతీ సభలోనూ ఇదే హామీని పదే పదే ప్రకటించడం వల్ల బెంగుళూరులోని..
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఓ హామీ మహిళలను పోస్టాఫీస్‌కు పరుగులు పెట్టిస్తోంది. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలో వస్తే ప్రతి మహిళ అకౌంట్లో నెలకు 8 వేల 500 రూపాయలు జమ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటతో పోస్టాఫీస్‌లో ఖాతాలు తెరిచేందుకు మహిళలు ఎగబడుతున్నారు. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్న ప్రతీ సభలోనూ ఇదే హామీని పదే పదే ప్రకటించడం వల్ల బెంగుళూరులోని జనరల్ పోస్టాఫీసులో మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఖాతా తెరిచేందుకు క్యూ కట్టారు. అయితే, వారిలో కొందరికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే తమకు డబ్బులు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. తమ ఖాతాలో రూ. 2 వేలు లేదా రూ.8 వేల 500 జమ అవుతాయనే నమ్మకంతో ప్రజలు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వస్తున్నారనీ చీఫ్ పోస్ట్ మాస్టర్ మంజేష్ అన్నారు. నిజానికి ఇది ఒక వదంతని ఈ మహిళలకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఎలాంటి మొత్తాన్ని చెల్లించదనీ అన్నారు. అయితే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఖాతాను ఏ రకమైన ఆన్లైన్ లావాదేవీకైనా లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ పథకానికైనా ఉపయోగించవచ్చు అని వివరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.