తల్లి అప్పు చేసిన పాపానికి 9 ఏళ్ల కొడుకుకు మరణశిక్ష వీడియో

Updated on: May 24, 2025 | 7:16 PM

తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. తొమ్మిదేళ్ల బాలుడు మిస్సింగ్ కేసు కాస్త మరో మలుపు తిరిగింది. వెట్టి చాకిరీకి బాలుడిని బలి తీసుకున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది. తల్లి తీసుకున్న అడ్వాన్స్ సొమ్ముకు బాలుడిని బందిగా చేసిన వైనం కలకలం రేపింది. బాదులు మేపే పనికి అడ్వాన్స్ తీసుకున్న గూడూరు మండలం చెవటపాలెంకు చెందిన గిరిజన మహిళ అంకమ్మ కొడుకును యజమాని వద్ద తాకట్టు వస్తువుగా మార్చింది. తల్లి చెల్లించాల్సిన డబ్బు తీరేదాకా పసివాడిని పనిలో పెట్టుకున్న యజమాని దాష్టికం చూపించాడు.

ఏకంగా ఆ పసివాడి ఉసురు కూడా తీసుకున్నాడు. తొమ్మిదేళ్ల కొడుకు వెంకటేశు ఆచూకీపై ఆందోళనతో తల్లి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. సత్యవేడుకు చెందిన బాతుల వ్యాపారి ముత్తు వద్ద పనిచేస్తూ అప్పుగా తీసుకున్న డబ్బు తీర్చలేకపోయింది. దీంతో కొడుకును బాతులు మేపేందుకు వ్యాపారి ముత్తు వద్ద తొమ్మిది నెలల క్రితం పనిలో పెట్టింది. బాతులు మేపే పనిలో ఉన్న కొడుకును తిరిగి తీసుకు వెళ్లేందుకు అప్పుగా తీసుకున్న 40,000 సమకూర్చుకునే ప్రయత్నం చేసిన తల్లి అంకమ్మ గత నెలలో అప్పు తీర్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బాతుల వ్యాపారి ముత్తుకు ఫోన్ చేసి అప్పు కడతానని చెప్పింది. కొడుకును అప్పగించాలని కోరింది. సమయం కావాలన్న ముత్తు దాటవేసే ప్రయత్నం చేశారు.