అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ఉరవకొండలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తవ్విన నీటి గుంతలో ఐదేళ్ల చిన్నారి ప్రణీత్ ప్రమాదవశాత్తు పడిపోయాడు. వెంటనే స్పందించిన ఏడేళ్ల అన్న లింగేష్, తమ్ముడిని బయటకు లాగి ప్రాణాలు కాపాడాడు. 15 రోజులుగా గుంతలు పూడ్చకుండా వదిలేయడంపై తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై నిలదీశారు, తక్షణ మరమ్మతులు, గుంతల పూడ్చివేతకు డిమాండ్ చేశారు.
ఇద్దరు చిన్నారులు ఇంటిముందు ఆడుకుంటున్నారు. అంతలో ఓ చిన్నారి ఇంటి ముందు కొళాయి పైపులైన్లు మరమ్మత్తుల కోసం తవ్విన గుంతలో పడిపోయింది. వెంటనే స్పందించిన చిన్నారి అన్న తమ్ముడు చెయ్యి పట్టుకుని బయటకు లాగి ప్రాణాలు కాపాడాడు. అనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉరవకొండ లోని భద్రప్ప బావి వీధిలో 15 రోజుల క్రితం కులాయి మరమ్మత్తులో కోసం గుంతలు తవ్వి వదిలేశారు మున్సిపాలిటీ సిబ్బంది. పైపుల లీకేజీతో ఆ గుంత నీటితో నిండిపోయింది. ఆ ప్రాంతంలో ఇంటిముందు ఆడుకుంటున్న ఐదేళ్ల ప్రణీత్ ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయాడు. నీటి గుంటలో పడి మునిగిపోతుండగా తమ్ముడు ప్రణీత్ ను చేయి పట్టుకొని ఏడేళ్ల అన్న లింగేష్ కాపాడాడు. గుంతలు తవ్వి 15 రోజులైనా పూడ్చకుండా వదిలేయడంతో బాలుడి ప్రాణాల మీదకు వచ్చిందంటూ బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సిబ్బందిని స్థానికులు నిలదీశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చిన్నారికి తృటిలో ప్రాణాపాయం తప్పిందని, ఇప్పటికైనా త్వరగా మరమ్మతులు పూర్తిచేసి గుంతలు పూడ్చాలని డిమాండ్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Medaram Jathara: వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
KA Paul: ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
గ్రీన్‌లాండ్ కు సైనిక బలగాల తరలింపు
Gold Price Today: చుక్కల్ని తాకుతున్న బంగారం, వెండి ధర.. మంగళవారం ఎంత పెరిగిందంటే
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు.. వెదర్ రిపోర్ట్
