ఓర్నీ ఏషాలో.. మోకాళ్లోతు నీళ్లలో వింత స్టంట్స్.. స్లిప్‌ అయ్యావో సీన్‌ సితారే..

|

Jul 14, 2022 | 5:58 PM

దేశవ్యాప్తంగా భారీ వర్షాలతో పలు పట్టణాలు, పల్లెలు అన్నీ నీట మునిగాయి. రహదారులు జలమయం అయిపోయాయి. వాహనదారులే కాదు, పాదచారులు కూడా రోడ్డుపై నడిచి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

దేశవ్యాప్తంగా భారీ వర్షాలతో పలు పట్టణాలు, పల్లెలు అన్నీ నీట మునిగాయి. రహదారులు జలమయం అయిపోయాయి. వాహనదారులే కాదు, పాదచారులు కూడా రోడ్డుపై నడిచి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. మోకాల్లోతు నీరు నిండిపోయిన రోడ్డుపై కాలు తడవ కుండా నడిచి వెళ్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ యువకుడు చేసిన పని చూసిన నెటిజన్లు ఓర్నీ ఏషాలో… స్లిప్‌ అయ్యావో మొదటికే మోసపోతావ్‌ జాగ్రత్త అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక కాలనీ మొత్తం నీటిలో మునిగిపోయి కనిపిస్తోంది. అయితే ఆ నీటిలోంచి నడిచి వెళ్లేందుకు ఓ యువకుడు రెండు ప్లాస్టిక్‌ స్టూళ్లను ఆసరాగా తీసుకున్నాడు. వాటికి తాళ్లు కట్టి నీటిలో పెట్టి ఒకదాని మీదనుంచి మరొకదాని మీదకు జంప్ చేస్తూ వెళ్తున్నాడు. ఈ యువకుడి ఐడియాకి అందరూ ఫిదా అయిపోతున్నారు. అంతే కాదు.. ఐడియా బానే ఉంది కానీ స్టూలు స్లిప్‌ అయితే సీన్‌ సితార అయిపోద్ది సుమా అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నీ ఐడియా సూపర్‌ గురూ అనే వాళ్లూ లేకపోలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డుపై నడిచి వెళ్తున్న పులి.. వేగంగా వచ్చి ఢీకొట్టిన వాహనం.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

వలలో చిక్కిన భారీ చేప.. వేలంలో ఎంత ధర పలికిందో తెలిస్తే కళ్లు జిగేల్ !!

Published on: Jul 14, 2022 05:57 PM