నా కారుకు పేరు పెట్టండి.. నెటిజన్లకు టెక్‌ దిగ్గజం బంపరాఫర్

Updated on: Oct 13, 2022 | 9:14 AM

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనదైన స్టైల్లో పోస్టులు పెడుతుంటారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనదైన స్టైల్లో పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన నెటిజన్లకు ఓ బంపరాఫర్‌ ఇచ్చారు. ఆయన చేతికొచ్చిన ఓ కారుకు పేరు పెట్టాలని నెటిజన్లను అడిగారు. మహీంద్రా సంస్థ రెండు నెలల క్రితం ఎస్‌యూవీ స్కార్పియో ఎన్‌ మోడల్‌ కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రెండు వారాల క్రితమే వీటి డెలివరీలు కూడా మొదలయ్యాయి. అయితే తాజాగా సంస్థ ప్రతినిధి ఆనంద్‌ మహీంద్రాకు ఈ కారు తాళాలు అందించారు వారి కంపెనీ ప్రతినిధులు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈరోజు తనకు చాలా అద్భుతమైన రోజు అని, స్కార్పియో ఎన్‌ కారు తన చేతికొచ్చిందని చెబుతూనే దీనికి ఒక మంచి పేరు కావాలని, ఎవరైనా సూచిస్తే స్వాగతిస్తానంటూ ట్వీట్టర్ లో తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కస్టమర్‌కు ‘ఉబర్‌’ షాక్‌.. 15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షల ఛార్జ్ !!

181 ఏళ్లుగా సీసాలో భద్రపరిచిన ఓ వ్యక్తి తల.. అతడెవరో తెలుసా ??

Published on: Oct 13, 2022 09:14 AM
Follow Us