తేనెటీగకు లీగల్‌ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత

Updated on: Jan 02, 2026 | 5:01 PM

తేనెటీగలు వ్యవసాయానికి, పర్యావరణానికి అత్యంత కీలకం. పంటలకు పరాగ సంపర్కం చేసి ఆహార భద్రతను అందిస్తాయి. అమెజాన్‌లోని స్టింగ్‌లెస్ తేనెటీగలకు పెరూ దేశం చట్టబద్ధ హక్కులు కల్పించింది. ఇవి అమెజాన్ అడవుల ఎదుగుదలకు, భూతాప నియంత్రణకు దోహదపడతాయి. పర్యావరణ మార్పుల ముప్పు నుండి వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.

సృష్టిలో ఎంతో విలువైన, అవసరమైన ప్రాణి ‘తేనెటీగ’. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం వ్యవసాయం తేనెటీగల మీదే ఆధారపడి జరుగుతోంది. మనం పండిస్తున్న 100 రకాల పంటల్లో 90 రకాలు పుష్పించి, కాపు కాయాలంటే తేనెటీగలే అవసరం. అవి పువ్వుల్లోని మకరందాన్ని ఆస్వాదించే క్రమంలో తిరుగుతూ వేలాది పువ్వుల మీద వాలతాయి. అలా పుప్పొడి రేణువుల్ని మోసుకెళ్లడం వల్లే పరాగ సంపర్కం జరిగి పంటలు పండుతున్నాయి. ఒక వ్యక్తిని కుట్టిన తర్వాత అన్ని తేనెటీగలు చనిపోవు. కొన్ని జాతుల తేనెటీగలు మాత్రం చనిపోతాయని తేల్చారు.స్టింగ్‌లెస్ బీస్ మనుషులను కుట్టలేవు. ఎందుకంటే అవి మానవులకు హాని కలిగించేంత శక్తివంతంగా ఉండవు. అమెజాన్ అడవులకి ప్రత్యేకమైన స్టింగ్‌లెస్‌ తేనెటీగలకు తాజాగా చట్టపరమైన హక్కులను కల్పిస్తూ పెరూ దేశంలోని కొన్ని మున్సిపాలిటీలు ఆర్డినెన్స్ జారీ చేసాయి. అవి అంతరించకుండా కాపాడేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించాయి. వాతావరణం నుంచి పెద్దఎత్తున కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించే అమెజాన్ అడవులు భూతాపాన్ని నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. కానీ దశాబ్దాలుగా కొనసాగుతున్న అడవుల నరికివేతకు తోడు ప్రస్తుతం పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు, వాతావరణ మార్పుల వల్ల అమెజాన్ అంతరించిపోతుందనే భయం ప్రపంచం కలవరపెడుతోంది. అమెజాన్‌కే ప్రత్యేకమైన ఈ తేనెటీగలు పొడవైన, దట్టమైన పచ్చని చెట్లు పెరగడానికి కారణమవుతున్నాయట. ఒక వ్యక్తిని కుట్టిన తర్వాత తేనెటీగ చనిపోతుందని చాలా మంది నమ్ముతారు. దక్షిణ అమెరికాలో 6.7 మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర అమెజాన్‌ విస్తరించి ఉంది. ఇది భారత్ కన్నా రెండింతలకు పైగా పెద్దది. భూమిపై జీవవైవిధ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

10 రోజులు షుగర్ తినడం మానేస్తే మన శరీరంలో జరిగేది తెలిస్తే

జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది

ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం

Lunar Eclipse 2026: మార్చి 3న తొలి చంద్రగ్రహణం

కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్