చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో

Updated on: Dec 26, 2025 | 11:32 AM

చిరు వ్యాపారులు కొందరు తల వెంట్రుకలకు స్టీలు సామాన్లు ఇవ్వడం, పనికిరాని ప్లాస్టిక్‌ వస్తువులు తీసుకొని ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న వస్తువులు ఇవ్వడం చూశాం. కానీ తాజాగా ఓ వ్యక్తి వినూత్న కార్యక్రమం చేపట్టాడు. ఇంట్లోని చెత్త, పనికిరాని ప్లాస్టిక్‌ ఇవ్వండి.. మీకు కావలసిన కూరగాయలు, తినుబండారాలు ఇస్తాను అంటున్నాడు. ఇంతకీ ఈ కార్యక్రమం వెనుక అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు “నేను సైతం” అంటూ ముందుకు వచ్చాడు సత్యనారాయణ రాజు అనే వ్యక్తి. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బాటి ల్ ప్లాస్టిక్ చెత్త తీసుకురండి ఉచితంగా కూరగాయలు తినుబండారాలు తీసుకెళ్లండి అంటూ ఒక స్టాల్ నే ఏర్పాటు చేశాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంక కు చెందిన సత్యనారాయణ రాజు తన ఫౌండేషన్ ద్వారా ఈ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో ఒక కిలో ప్లాస్టిక్ బాటిళ్లకు ఒక కిలో బంగాళదుంపలు ఉల్లిపాయలు,లేదా తినుబండారాలు ఉచితంగా అందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో