Aliens: మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
గ్రహాంతరవాసులు అసలు ఉన్నారా..లేరా.. అన్నది పక్కన పెడితే.. గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారం ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. దశాబ్దాలుగా అన్వేషణ కొనసాగుతున్నా ఏలియన్స్ జాడకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదు. దీంతో ఈ విశ్వంలో మనుషులు మాత్రమే ఒంటరిగా ఉన్నారా?
గ్రహాంతరవాసులు అసలు ఉన్నారా..లేరా.. అన్నది పక్కన పెడితే.. గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారం ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. దశాబ్దాలుగా అన్వేషణ కొనసాగుతున్నా ఏలియన్స్ జాడకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదు. దీంతో ఈ విశ్వంలో మనుషులు మాత్రమే ఒంటరిగా ఉన్నారా?.. అనే ప్రశ్నకు ఇంకా నిర్దిష్టమైన సమాధానం లేదు. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం ఈ భూమిపై మనుషుల మధ్యే గ్రహాంతర వాసులు కూడా జీవిస్తుండవచ్చునని చెబుతోంది. రూపం మార్చుకొని మనుషుల మధ్యే రహస్యంగా నివసిస్తుండవచ్చునని అభిప్రాయపడింది.
గ్రహాంతర జీవులకు సంబంధించినవిగా భావించే యూఎఫ్‌వోలపై అధ్యయనం కోసం హార్వర్డ్ యూనివర్శిటీ ఏర్పాటు చేసిన హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రామ్‌లోని పరిశోధకులు ఈ మేరకు తమ పరిశోధనను ప్రచురించారు. ఏలియన్స్ భూగర్భంలో, చంద్రుడిపై లేదా మనుషుల మధ్యే జీవిస్తూ ఉండవచ్చునని అధ్యయనం పేర్కొంది. యూఎఫ్‌వోలు లేదా గుర్తించబడని వైమానిక దృగ్విషయాలు, భూమిపై నివసించే గ్రహాంతర వాసుల కోసం వచ్చిన.. స్నేహితుల అంతరిక్ష నౌకలు కావచ్చుననే కోణంలో కూడా అన్వేషిస్తున్నట్టు అధ్యయనం పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.