Alien Corpses: ఏలియన్ల శవాలని చెప్పినోడు చేసిన నిర్వాకం ఇదీ

|

Sep 19, 2023 | 9:46 AM

మన భూమ్మీదే గ్రహాంతర వాసులు తిరిగారని చెబుతున్న జైమే మెస్సాన్ అనే జర్నలిస్టు ఇటీవల తెరముందుకు తీసుకొచ్చిన ‘ఏలియన్’ శవాలు మళ్లీ చర్చకు దారి తీశాయి. గుర్తుతెలియని యుఎఫ్‌వోల గురించి కూడా ఆరా తీసే మెస్సాన్ మెక్సికో పార్లమెంటులో ప్రదర్శించిన రెండు ‘ఏలియన్ మృతదేహాలు’పై శాస్త్రవేత్తలు ఆరా తీస్తున్నారు. వీటి డీఎన్ఏలో మూడింట ఒక వంతు మనిషులది కాదని, అవి వెయ్యేళ్ల నాటివని మాసాన్ అంటున్నాడు.

మన భూమ్మీదే గ్రహాంతర వాసులు తిరిగారని చెబుతున్న జైమే మెస్సాన్ అనే జర్నలిస్టు ఇటీవల తెరముందుకు తీసుకొచ్చిన ‘ఏలియన్’ శవాలు మళ్లీ చర్చకు దారి తీశాయి. గుర్తుతెలియని యుఎఫ్‌వోల గురించి కూడా ఆరా తీసే మెస్సాన్ మెక్సికో పార్లమెంటులో ప్రదర్శించిన రెండు ‘ఏలియన్ మృతదేహాలు’పై శాస్త్రవేత్తలు ఆరా తీస్తున్నారు. వీటి డీఎన్ఏలో మూడింట ఒక వంతు మనిషులది కాదని, అవి వెయ్యేళ్ల నాటివని మాసాన్ అంటున్నాడు. దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశంలోని కుస్కోలో 2017లో ఇవి దొరికాయంటున్నాడు. అయితే మాసాన్ ఇలా చెప్పడం కొత్తేమీ కాదని కొందరు శాస్త్రవేత్తలు తోసిపుచ్చుతున్నారు. ఆ ‘శవాల’ గురించి నిజానిజాలు నిగ్గుదేల్చడానికి అందరికీ అందుబాటులో ఉంచి పరీక్షలు జరపాల్సి ఉందని, అది చేయకుండా ఏదోదో చెప్పడం సరికాదని అంటున్నారు. మాసాన్ ఇదివరకు కూడా ఇలాగే చెప్పి బోల్తాకొట్టించిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు. మైసాన్ 2015లోనూ ఓ శవాన్ని పట్టుకొచ్చి ‘ఏలియన్’ అన్నాడు. అది కూడా పెరూలోని నాజ్కాలో దొరికిందని, దాని ఆకారం, ధాతువులు మనుషులు కావని బుకాయించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కేరళలో నిఫా వైరస్‌ టెర్రర్‌ !! నిఫా ప్రాణాంతక వ్యాధి అంటున్న ఐసీఎంఆర్‌

Follow us on