హృదయవిదారకం.. ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు.. ఏం జరిగిందంటే.. ?

Updated on: Jan 21, 2026 | 3:13 PM

ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన: ఎయిడ్స్‌తో బాధపడుతున్న తల్లిని బంధువులు వదిలేయగా, 8 ఏళ్ల కొడుకు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తల్లి మరణానంతరం అనాథగా మారిన ఆ చిన్నారి, భూ వివాదంతో మేనమామల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించాడు. ఎయిడ్స్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన ఆ బాలుడికి పోలీసులు భరోసా ఇచ్చి అంత్యక్రియలు జరిపించారు. ఈ ఘటన సామాజిక వివక్షను, కుటుంబ బంధాల క్షీణతను ప్రతిబింబిస్తుంది.

ఎయిడ్స్‌తో బాధపడుతోంది ఓ మహిళ. ఆమెను దగ్గరుండి ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బంధువులెవరూ రాలేదు. ఆమె 8 ఏళ్ల కుమారుడే ఆ సమయంలో ఆమెకు ఆపద్భాంవుడయ్యాడు. అంత చిన్న వయసులో ఆ చిన్నారి తన తల్లి వెంట ఆమెకు చికిత్స చేయించడానికి ఒక్కడే ఆసుపత్రికి వెళ్లడం చూపరులను కంట తడి పెట్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో గుండెను పిండేసే ఘటన జరిగింది. ఎయిడ్స్‌ సోకి ఎనిమిది నెలల క్రితం బాలుడి తండ్రి సురేంద్ర మరణించాడు. అతని భార్య నీలమ్‌ ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆమెకి పరీక్షల్లో ఎయిడ్స్‌ వ్యాధి సోకినట్లు బయటపడింది. ఫరూఖాబాద్‌లోని పుట్టింట్లో ఉంటూ ఆమె కొద్ది రోజులు చికిత్స తీసుకుంది. అనారోగ్యంతో ఉన్న సోదరి బాగోగులు చూడాల్సిన అన్నదమ్ములు భూ వివాదం కారణంగా ఆమెను దూరం పెట్టారు. పేదరికంలో ఉన్న నీలమ్‌కు 15 ఏళ్ల కుమార్తె, 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల నీలం ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో నగ్లా ధీరజ్‌ గ్రామానికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఎటా మెడికల్ కాలేజీకి తల్లిని ఆమె 8 ఏళ్ల కుమారుడు తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ జనవరి 15న ఆమె మరణించింది. ఆ సమయంలో ఎనిమిదేళ్ల కుమారుడు శాని ఒక్కడే తల్లి వద్ద ఉన్నాడు. వైద్య సిబ్బంది సూచనతో పోస్ట్‌మార్టం కోసం తల్లి మృతదేహం వెంట మార్చురీ వరకు వెళ్లాడు. తను ఒంటరిగా ఉన్నానని, చుట్టాలు ఎవరూ రాలేదని తల్లిని తానే స్వయంగా తీసుకువచ్చినట్లు చెప్పి ఏడ్చాడు. భూ వివాదం కారణంగా మేనమామల నుంచి తనకు ప్రాణహాని ఉందని చిన్నారి ఆరోపించాడు. ఎయిడ్స్‌ కారణంగా తల్లితండ్రులు మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఒంటరిగా ఏడుస్తున్న ఆ బాలుడ్ని ఓదార్చారు. అతడి నుంచి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని వారికి సమాచారం ఇచ్చారు. దగ్గరుండి పోస్ట్‌మార్టం ఏర్పాట్లు చూశారు. అనంతరం ఆ మహిళ అంత్యక్రియలను కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు జరిపించారు. ఆ బాలుడి భద్రతకు భరోసా ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెండి బంగారం ధరలపై గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

Published on: Jan 21, 2026 01:03 PM