Adolf Hitler Watch: వేలం పాటకు హిట్లర్ వాచ్.. ఎంత ధర పలికిందో తెలిస్తే !!

|

Aug 12, 2022 | 9:36 AM

1933 లో హిట్లర్ కు బహుమతిగా ఇవ్వబడిన వాచ్‌ను అమెరికాలో వేలం వేశారు. ఒకప్పటి జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ కు చెందిన వాచ్‌ను ఓ వ్యక్తి 1.1 మిలియన్‌ డాలర్లకు అంటే 8 కోట్ల 7 లక్షలకు కొనుగోలు చేశారు.

1933 లో హిట్లర్ కు బహుమతిగా ఇవ్వబడిన వాచ్‌ను అమెరికాలో వేలం వేశారు. ఒకప్పటి జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ కు చెందిన వాచ్‌ను ఓ వ్యక్తి 1.1 మిలియన్‌ డాలర్లకు అంటే 8 కోట్ల 7 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ బంగారు ఆండ్రియాస్ హుబెర్ రివర్సిబుల్ చేతి గడియారం నాజీ పార్టీ గుర్తును కలిగి ఉంది. అలాగే దీనిపై AH అని అడాల్ఫ్ హిట్లర్ పేరును సూచిస్తూ.. అక్షరాలు చెక్కి ఉన్నాయి. ఇది మేరీల్యాండ్‌లోని అలెగ్జాండర్ హిస్టారికల్ వేలంలో అనామక బిడ్డర్‌కు విక్రయించబడింది. ఈ గడియారాన్ని హిట్లర్‌కు ఏప్రిల్ 20, 1933న అతని 44వ పుట్టినరోజున బహుమతిగా ఇచ్చారని చెప్పారు. అయితే ఈ వేలాన్ని యూద నేత‌లు ఖండించారు. దీనిపై స్పందించిన వేలం నిర్వాహకుడు తన ఉత్పత్తి కేటలాగ్‌లో “గడియారం, దాని చరిత్రను ప్రపంచంలోని అత్యంత అనుభవజ్ఞులైన, గౌరవనీయమైన వాచ్‌మేకర్లు, ఇంకా సైనిక చరిత్రకారులు పరిశోధించారని, వీరంతా ఇది అడాల్ఫ్‌ హిట్లర్‌కు చెందినదని, అంతేకాదు అది ఎంతో ప్రామాణికమైనదిగా నిర్ధారించినట్లు తెలిపాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పురుషులు ఈ పండ్లు తింటే ఆ సమస్యలన్నీ మటుమాయం !!

గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్‌ చేద్దామనుకున్నారు.. జైల్లో కూర్చున్నారు

Published on: Aug 12, 2022 09:36 AM