డెడ్‌లైన్‌ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో

Updated on: Dec 26, 2025 | 4:28 PM

భారతదేశంలోని పౌరులకు పాన్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఒకటి. చాలా ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు అనేది తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా.. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీల కోసం, ఇంకా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు.. బ్యాంకులో లోన్ తీసుకునేందుకు ఇలా చాలా అవసరాలకు పాన్ కార్డు అవసరం ఉంటుంది. ఇక ఇన్‌కంటాక్స్ యాక్ట్ ప్రకారం.. ఆధార్‌తో పాన్‌ కార్డును కచ్చితంగా లింక్ చేసుకోవాలి. నకిలీ పాన్ కార్డుల్ని నిరోధించేందుకు.. పాన్ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) దీనిని తప్పనిసరి చేసింది.

గతంలో పాన్ కార్డులు తీసుకున్నవారు.. లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ద్వారా పాన్ కార్డును తీసుకున్నవారు.. కచ్చితంగా డిసెంబర్ 31లోగా పాన్- ఆధార్ కార్డును లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వచ్చే ఏడాది జనవరి 1 నుంచే సదరు పాన్ కార్డులు అన్నీ రద్దవుతాయి. దీంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని గుర్తుంచుకోవాలి. దీని ప్రభావం నేరుగా ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు, రీఫండ్‌లు, టిడిఎస్ క్రెడిట్‌లు వంటి ముఖ్యమైన సేవలపై పడనుంది. ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఈ విషయంలో స్పష్టమైన గడువును ప్రకటించింది. డిసెంబర్ 31, 2025 లోపు పాన్–ఆధార్ లింక్ తప్పనిసరి అని తెలిపింది.అక్టోబర్ 01, 2025 కంటే ముందు పాన్ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాల్సిందే. ఈ గడువును మిస్ చేస్తే, వారి పాన్ కార్డు ఆటోమేటిక్‌గా “నాన్-ఆపరేటివ్” లోకి వెళ్తుంది. అంటే పాన్ కార్డు ఉన్నా, అది చట్టపరంగా ఉపయోగపడదు. అందుకే పన్ను చెల్లింపుదారులు చివరి తేదీ కోసం వేచి చూడకుండా ఇప్పుడే చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో