Youngman stunts: చెన్నై రోడ్లపై రెచ్చిపోయిన హైదరాబాద్ కుర్రోడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు..!
హైదరాబాద్‌కు చెందిన యూ ట్యూబర్ అలెక్స్ బినోయ్, అతని స్నేహితులు కలిసి చెన్నైలోని డీఎంకే కార్యాలయం ఎదురుగా ఉన్న తేనాంపేట్ రోడ్డులో ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ..
హైదరాబాద్‌కు చెందిన యూ ట్యూబర్ అలెక్స్ బినోయ్, అతని స్నేహితులు కలిసి చెన్నైలోని డీఎంకే కార్యాలయం ఎదురుగా ఉన్న తేనాంపేట్ రోడ్డులో ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసారు. ఆ తర్వాత ఈ వీడియోలను యూట్యూబ్‌లో పెట్టారు. ఇది చూసిన కొందరు వీడియోలను షేర్ చేస్తూ చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు అలెక్స్ బృందాన్ని అదుపులోకి తీసుకోగా.. అలెక్స్ పరారయ్యాడు. అనంతరం హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకుని జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ పొందిన అనంతరం కోట్ల అలెక్స్ బినాయ్‌కు పోలీసులు సామాజిక బాధ్యత తెలిసొచ్చేలా పలు కార్యక్రమాలను రూపొందించారు. దీనిలో భాగంగా అక్టోబరు 3న తేనాంపేట సిగ్నల్ వద్ద రోడ్డు భద్రత కరపత్రాలను పంచేలా చేశారు. అదేవిధంగా ప్రధాన సిగ్నల్ దగ్గర రోడ్డు భద్రతపై ప్లకార్డ్స్ పట్టుకుని ప్రదర్శన చేయించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..