Young woman: వర్షం నీటిలో ఎంజాయ్‌చేస్తున్న యువతి.. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

Updated on: Sep 26, 2022 | 11:24 AM

సోషల్ మీడియా యుగంలో రీల్స్ చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ రీల్స్ చేస్తుంటారు. ఇందులో కొన్ని రీల్స్ మాత్రం నెట్టింట్లో


సోషల్ మీడియా యుగంలో రీల్స్ చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ రీల్స్ చేస్తుంటారు. ఇందులో కొన్ని రీల్స్ మాత్రం నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటాయి. వీటిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటూ, తమను తాము మర్చిపోతుంటారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.వర్షంలో తడవడం అంటే చాలామందికి ఇష్టం. ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోకుండా వర్షం నీటిలో ఎంజాయ్‌ చేస్తారు. అయితే, కొన్నిసార్లు ఈ వినోదం వల్ల కొన్ని ఇబ్బందుల్లో పడిపోతుంటారు. ఓ అమ్మాయి కూడా నీళ్లలో సరదాగా గడిపేందుకు తెగ ఆరాటపడింది. ఓ పార్క్‌లో వర్షపు నీరు నిండి ఉంది. అది చూసి ఓ అమ్మాయి అక్కడికి చేరుకుని డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. కూల్ వెదర్‌ను బాగా ఎంజాయ్ చేద్దామనుకుంది. అలా చేస్తూ.. ఇంకొంచెం ముందుకు అడుగులు వేసేందుకు ప్రయత్నించింది. కానీ, కాలు జారి నీటి గుంతలో పడిపోయింది. దీంతో ఆమె బట్టలు మొత్తం తడిచిపోయాయి. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోపై పలు కామెంట్లు చేస్తూ, నవ్వుల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Sep 26, 2022 11:24 AM
Follow Us